పెళ్లికి ముందే ప్రియుడితో స్టార్ డాటర్ హనీమూన్
ఇరా తన పక్కన కూర్చున్న నూపూర్ తన కాళ్లను గాలిలోకి పైకి లేపి ఉన్న రెండు ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.
By: Tupaki Desk | 28 Aug 2023 8:33 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె ఇరా ఖాన్ ఒంటరితనం డిప్రెషన్ గురించి చాలాసార్లు ఓపెనైంది. అదే క్రమంలో తన తండ్రికి తనకు వ్యాయామ శిక్షకుడిగా పని చేసిన నూపుర్ శిఖారేని ప్రేమించింది ఇరా. ఇరా- నుపూర్ల నిశ్చితార్థం గతేడాది ముంబైలో జరిగింది. అయితే ఇరా ఇంకా పెళ్లికి ముందే బోయ్ ఫ్రెండ్ తో వెకేషన్ కి వెళ్లిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇరా ఖాన్ కాబోయే భర్త నుపుర్ శిఖరేతో అందమైన హాలిడే ఫోటోలను షేర్ చేయగా వాటిని అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఉదయపూర్ నుండి వెకేషన్ ఫోటోలివి. గూఫీ ఫోటోలలో ఇరా ఎంతో సంతోషంగా కనిపించింది. ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్‌లో ఇరా ఇలా రాసింది. ''ఫోన్ ఎందుకు గాలిలో ఉందా? అని ఆలోచిస్తుంటే.. ఇంతలోనే.. ఇలా.... మీరు ఏం చేస్తున్నారు శిఖర్?'' అని ఇరా వ్యాఖ్యను జోడించింది. ఉదయపూర్‌లోని తాజ్ ఆరావళి రిసార్ట్ అండ్ స్పా వద్ద తీసిన అరుదైన ఫోటోలు ఇవని తెలిపింది. ఇరా- నుపుర్ ఒక తోటలో పగటిపూట రాటన్పై కూల్ గా ఎంజాయ్ చేస్తున్నప్పటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నూపూర్ -ఇరా గాలిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను విస్మయంగా చూస్తూ ఉన్న ఫోటో... నూపూర్ ఫోన్‌ని పరిశీలిస్తుండగా ఐరా తనవైపే చూస్తోంది. ఇరా తన పక్కన కూర్చున్న నూపూర్ తన కాళ్లను గాలిలోకి పైకి లేపి ఉన్న రెండు ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఇరా గూఫీ ఎక్స్ప్రెషన్ ఇవ్వగా నూపూర్ నవ్వులు చిందిస్తూ కనిపించాడు.
సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపుర్ కొన్ని నెలల ముందు ఇరా ఖాన్‌కి ఇటలీలో ప్రపోజ్ చేశాడు. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో తమ ప్రతిపాదనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోను షేర్ చేసారు. అనంతరం పెద్దల అంగీకారంతో ఈ జంట నవంబర్ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు అమీర్ ఖాన్, రీనా దత్తా, అమీర్ రెండో భార్య కిరణ్ రావు తదితరులు హాజరయ్యారు. అమీర్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యాడు.
ఇరా ఖాన్ గురించి మరింత..అమీర్ ఖాన్- మాజీ భార్య రీనా దత్తా 1997లో కుమార్తె ఇరా ఖాన్‌ను స్వాగతించారు. 2019లో ఇరా థియేటర్ ప్రొడక్షన్‌తో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఇందులో నటి హాజెల్ కీచ్ ప్రధాన పాత్రలో నటించారు. మెడియా అనేది ఈ షో టైటిల్. అదే పేరుతో యూరిపిడెస్ గ్రీకు నాటకానికి భారతీయ వెర్షన్ ఇది. అమీర్ -రీనాకు జునైద్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతడు త్వరలో సినిమాల్లో తన నటనా రంగ ప్రవేశం చేయబోతున్నాడని సమాచారం.
డిప్రెషన్‌తో ఇరా యుద్ధం ఇరా ఖాన్ గత ఇంటర్వ్యూలలో డిప్రెషన్‌తో తన కష్టాల గురించి ఓపెనైంది. తన కుటుంబీకుల నుండి సరైన మద్దతు కోసం ఎంతగా తహతహలాడిందో కూడా వెల్లడించింది. తన డిప్రెషన్ పాక్షికంగా జన్యుపరమైనది అని కూడా తెలిపింది. ''డిప్రెషన్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఇది పాక్షికంగా జన్యుపరమైనది.. పాక్షికంగా మానసికమైనది.. సామాజికమైనది. నా విషయంలో ఇది పాక్షికంగా జన్యుపరమైనది. మా అమ్మ - నాన్నల వైపు నా కుటుంబంలో మానసిక ఆరోగ్య సమస్యల చరిత్ర చాలా దాగి ఉంది..'' అని ఇరా వెల్లడించింది.