Begin typing your search above and press return to search.

వైభ‌వంగా అమీర్ ఖాన్ కుమార్తె వివాహం

'రాయల్ సంగీత్ నైట్: స్టార్-స్టడెడ్ ఎఫైర్' పేరుకు త‌గ్గ‌ట్టే సంగీత్ వేడుక రాజరికానికి తక్కువ ఏమీ లేదు. ఇరా ఖాన్ మెరూన్ వెల్వెట్ లెహంగాలో రాకుమారిలా వేదిక వ‌ద్ద‌కు ప్రవేశించింది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:20 AM GMT
వైభ‌వంగా అమీర్ ఖాన్ కుమార్తె వివాహం
X

గ‌త కొద్ది రోజులుగా మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వివాహ వార్త‌లు మీడియాలో ప్ర‌ధానంగా హైలైట్ అవుతున్నాయి. ఇరా ఖాన్ - నుపుర్ శిఖరేల ప్రీవెడ్డింగ్ వేడుక‌లు లేక్స్ నగరం ఉదయపూర్ లో ఇటీవ‌ల ప్రారంభం కాగా ఎట్ట‌కేల‌కు ఈ జంటకు పెళ్ల‌యింది.

ఉదయపూర్ లో ఈ పెళ్లి వేదిక లైట్నింగ్ కాంతుల‌తో ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చింది. ఆ ఇద్ద‌రి కలయిక, సన్నిహిత క్షణాలు .. గొప్ప ఉత్సవాల సమ్మేళనం కాగా, రాజస్థాన్ సుందరమైన అందాల మధ్య ఈ జంట పెళ్ల‌యింది. ప్రీవెడ్డింగ్ వేళ ఇరాఖాన్ సంగీత్ వేడుకలో అమీర్ ఖాన్ పాడాడు. అతని ప్రదర్శన హృదయాలను గెలుచుకుంది. "గ్రాండ్ వెడ్డింగ్ సెర్మనీ: ఎ విజన్ ఇన్ వైట్" పేరుతో పెళ్లి వేడుక‌ను సెల‌బ్రేట్ చేసారు.

ముందుగా ముంబైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఉదయపూర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో పెళ్లాడారు. పెళ్లి రోజున ఇరా తెల్లని లేస్ గౌనులో కనిపించింది. నుపుర్ లేత గోధుమరంగు తెలుపు రంగు సూట్‌లో క‌నిపించాడు. కొత్త జంట‌ చేయి చేయి కలిపి నడుచుకుంటూ వెళుతుండగా, ఈ జంట పైకి తెల్లటి పువ్వుల‌ను విసురుతూ అహూతులు అల‌రించారు.

'రాయల్ సంగీత్ నైట్: స్టార్-స్టడెడ్ ఎఫైర్' పేరుకు త‌గ్గ‌ట్టే సంగీత్ వేడుక రాజరికానికి తక్కువ ఏమీ లేదు. ఇరా ఖాన్ మెరూన్ వెల్వెట్ లెహంగాలో రాకుమారిలా వేదిక వ‌ద్ద‌కు ప్రవేశించింది. నుపుర్ శిఖరే షార్ప్ పార్టీ సూట్‌లో అదరగొట్టాడు. అమీర్ ఖాన్ తన రెండవ మాజీ భార్య కిరణ్ రావు , వారి కుమారుడు ఆజాద్‌తో కలిసి 'ఫూలన్ కా తారోన్ కా' అనే హార్ట్ ట‌చింగ్ పాటను ఇరాకు అంకిత‌మిస్తూ పెళ్లిరోజు నైట్ కి ఆకర్షణను జోడించారు. పెళ్లి వేదికపై హిందుస్థానీ శాస్త్రీయ వాయిద్యాలను వాయిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించిన కుటుంబీకులు అతిథులను అల‌రించారు.

మెహందీ - పైజామా పార్టీ ఎంతో ఆహ్లాదంగా సాగింది. సంప్రదాయం సరదాల సమ్మేళనంతో తాజ్ లేక్ ప్యాలెస్‌లో మెహందీ వేడుకతో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇరా సాంప్రదాయక తెల్లని వస్త్రధారణలో ప్రకాశవంతంగా కనిపించగా, నుపుర్ రిలాక్స్డ్ పింక్ షర్ట్ ప్యాంట్ తో సింపుల్ గా క‌నిపించాడు. వ‌ధూవ‌రులు తమ స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ నవ్వుల‌తో రోజంతా గ‌డిచిపోయింది. తదనంతరం ఉత్సాహభరితమైన పైజామా పార్టీతో అంద‌రూ రిలాక్స్ అయ్యారు. ఈ పార్టీలో నూపూర్ 'లుంగీ డాన్స్' చేయ‌డం ఆస‌క్తిక‌రం.

కుమార్తె ఇరా ఖాన్ వివాహానికి అమీర్ ఖాన్ పూర్తి మద్దతుగా ఉండటం అమీర్, అతడి మొదటి భార్య రీనా దత్తా, రెండవ మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఆధునిక కుటుంబ బంధాల సారాంశాన్ని ఈ వేదిక వ‌ద్ద ఎలివేట్ చేసారు. జూలై 2021లో కిరణ్ రావుతో అతని వివాహబంధం ముగిసినప్పటికీ ఇద్దరూ తమ కుమారుడు ఆజాద్ కి సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. వివాహ వేడుకల్లో చురుకుగా పాల్గొన్నారు. వేడుకల్లో కిరణ్ కీలక పాత్ర పోషించ‌డం, రీనా ఆనందంగా క‌నిపించ‌గా, ఇరా ఎంతో సంతోషంగా చిల్ అయింది. ప్రశాంతమైన మెహందీ నుండి ఉత్సాహభరితమైన సంగీత్ .. గ్రాండ్ వెడ్డింగ్ వేడుక వరకు ప్రతి స‌న్నివేశం అంద‌మైన‌ జంట ప్రేమకు, వారి చుట్టూ ఉన్న కుటుంబ బంధాలకు నిదర్శనంగా నిలిచాయి.