బెంగళూరు యువతితో అమీర్ ఖాన్ డేటింగ్?
ఇటీవల ఆ మహిళను తన మొత్తం కుటుంబానికి పరిచయం చేశాడని, వారి సమావేశం చాలా బాగా జరిగిందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 31 Jan 2025 12:25 PM GMTబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 59 వయసులో సీరియస్ గా ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడు బెంగళూరుకు చెందిన ఒక మిస్టరీ లేడీతో రిలేషన్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి. ప్రఖ్యాత ఫిలింఫేర్ కథనం ప్రకారం... అమీర్ ఖాన్ బెంగళూరుకు చెందిన యువతితో ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఆ మహిళను తన మొత్తం కుటుంబానికి పరిచయం చేశాడని, వారి సమావేశం చాలా బాగా జరిగిందని తెలుస్తోంది.
అమీర్ ఖాన్ ఇటీవల సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు. 'తారే జమీన్ పార్' సీక్వెల్ 'సితారే జమీన్ పార్'ని రిలీజ్ కి తెస్తున్నారు. ఇంతలోనే ఈ వార్త అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి అంతగా చర్చ జరగడం లేదు. దంగల్ నటి ఫాతిమాతో రిలేషన్ గురించి కూడా పెద్దగా గుసగుసలు లేవు. రెండేళ్ల క్రితం తన కుమార్తె ఇరా ఖాన్ ను ప్రేమించిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసాడు. ప్రస్తుతం వృత్తిపరంగా దృష్టి సారించాడు. ఇలాంటి సమయంలో సైలెంట్ గా అతడు బెంగళూరు యువతిని తన కుటుంబానికి పరిచయం చేసారనే గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే అతడి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అమీర్ ఖాన్ ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. నటి రీనా దత్తాను 1986లో వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ఇరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్. అనంతరం రీనా నుంచి 2002 లో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం కూడా వారు సన్నిహితంగా ఉన్నారు. పరస్పర గౌరవాన్ని కొనసాగించారు.
తరువాత 2005 లో తన సహాయకురాలు కిరణ్ రావును అమీర్ వివాహం చేసుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వారికి సరోగసీ ద్వారా జన్మించిన కుమారుడు ఆజాద్. అమీర్ కుమారుడు జునైద్ నటించిన లవ్ యాపా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. జునైద్ మహారాజ్ సినిమాతో తెరకు పరిచయమయ్యాడు. అమీర్ నటించిన తదుపరి చిత్రం `సితారే జమీన్ పర్` డిసెంబర్ 2025 లో విడుదల అవుతుంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పానిష్ చిత్రం ఛాంపియన్స్ కి అధికారిక రీమేక్. సన్నీడియోల్ ప్రధాన పాత్రలో లాహోర్ 1947 చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు.