Begin typing your search above and press return to search.

స్టార్ రైటర్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా..?

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కు రైటర్ గా వర్క్ చేస్తున్న రవి.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 12:01 PM GMT
స్టార్ రైటర్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా..?
X

ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు ఆయన రచయితగా పని చేశారు. స్క్రీన్ ప్లే - డైలాగ్స్ సమకూర్చారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కు రైటర్ గా వర్క్ చేస్తున్న రవి.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

అబ్బూరి రవి తన ఎక్స్ అకౌంట్ లో ''నేను ఇంక నిష్క్రమించవచ్చు. ఇది చాలు" అని ఓ ట్వీట్ పెట్టారు. దీనికి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి పెట్టారు. ఇక ఆపేయవచ్చు.. ఇది సరిపోతుందని అర్థం వచ్చేలా ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రచయిత ఏ విషయంలో ఇలాంటి పోస్ట్ పెట్టారు? ఈ కామెంట్ వెనుక ఉద్దేశ్యం ఏంటి? అసలు ఆయనకు ఏమైంది? అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు.

అబ్బూరి రవి ఇప్పటికే అనేక చిత్రాలకు వర్క్ చేయడంతో ఇకపై సినిమాలకు దూరం అవ్వాలని అనుకుంటున్నారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ దాని అర్థం ఇదే అయితే, టాలీవుడ్ లో టాప్ రైటర్ గా కొనసాగుతున్న ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అంటున్నారు. మరికొందరు మాత్రం అది ఆయన సినీ కెరీర్ కు సంబంధించినది అయ్యిండదని, ఆ పోస్ట్ వెనుక ఏదో నిగూఢ అర్ధం ఉండి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అబ్బూరి రవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినా.. అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పంచుకోడానికి, బర్త్ డే విషెస్ చెప్పటానికి వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు తన అభిప్రాయాలను నిర్భయంగా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే డ‌బ్బింగ్ సినిమాల‌కు తెలుగు టైటిల్స్ పెట్టకపోవడంపై ఫైర్ అయ్యారు. పరభాషా టైటిల్స్‌తో సినిమాలను రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అగౌర‌వ‌ప‌రుస్తున్నార‌ని విరుచుకుపడ్డారు. అలాంటి రచయిత ఇప్పుడు 'నేను నిష్క్రమించవచ్చు' అంటూ ట్వీట్ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇకపోతే దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అత్యంత సన్నిహితుడైన అబ్బూరి రవి.. 'నువ్వే నువ్వే' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత 'ఎలా చెప్పను' మూవీకి రైటర్ గా మారారు. బొమ్మరిల్లు, భగీరథ, అన్నవరం, అతిథి, డాన్, ఊపిరి, హైపర్, కిక్‌, క్ష‌ణం, ఎక్క‌డిపోతావు చిన్న‌వాడా, గూఢ‌చారి, ఎవరు, నాంది, ఉగ్రం, మేజర్, కస్టడీ, ఆ ఒకటీ అడక్కు చిత్రాలతో పాటుగా ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు కథా రచయితగా, డైలాగ్ రైటర్ గా పని చేశారు. 'బొమ్మ‌రిల్లు' చిత్రానికి గానూ బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా నంది అవార్డును అందుకున్నారు. నటుడిగానూ ఒకటి రెండు సినిమాల్లో కనిపించారు.

ప్రస్తుతం అబ్బూరి రవి 'డెకాయిట్' 'గూఢచారి 2' వంటి సినిమాలకు రచయితగా వర్క్ చేస్తున్నారు. రెండు చిత్రాల్లోనూ అడివి శేష్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలకు రవి డైలాగ్స్ రాయడంతో పాటుగా శేష్ కు స్క్రీన్ ప్లేలో గైడెన్స్ అందిస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.