మరోసారి రిస్క్ చేయనున్న అఖిల్?
ఆ తర్వాత ఏజెంట్ సినిమాతో చాలా పెద్ద ప్రయోగం చేసి, ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
By: Tupaki Desk | 6 March 2025 5:00 AM ISTస్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేదు. మధ్యలో హలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి మంచి సినిమాలను తీసినప్పటికీ అవి బ్లాక్ బస్టర్లు మాత్రం కాలేదు. ఆ తర్వాత ఏజెంట్ సినిమాతో చాలా పెద్ద ప్రయోగం చేసి, ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
ఏజెంట్ కోసం అఖిల్ పడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఇదిలా ఉంటే అఖిల్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా లో అఖిల్, పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమా చేయనున్నాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ట్రాక్ లో లేని పూరీతో అఖిల్ సినిమానా అని అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
అయితే పూరీతో సినిమా చేయడం ఏ హీరోకైనా ఎంత రిస్కో అంతే లాభం కూడా. ఇప్పటివరకు కెరీర్ లో మునుపెన్నడూ చూపించని విధంగా తన హీరోను పూరీ ఆడియన్స్ కు ప్రెజెంట్ చేస్తాడు. కాబట్టి పూరీతో సినిమా అంటే ఏదీ చెప్పలేం. రిస్క్ అయినా జరగొచ్చు, అద్భుతాలైనా జరగొచ్చు. మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే పూరీ తన హీరోలను చాలా డిఫరెంట్ గా, కొత్తగా చూపిస్తాడు. పూరీ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయితే మాత్రం హీరోలకు అతని కంటే మంచి ఛాయిస్ మరొకటి ఉండదు.
ఈ మధ్య పూరీ కథల్లో బలం ఉండటం లేదు. అసలు హీరోలకు ఏం చెప్పి సినిమాలకు ఒప్పిస్తున్నాడనే రేంజ్ లో ఆయన తీసిన రీసెంట్ సినిమాలున్నాయి. ఇలాంటి టైమ్ లో అఖిల్ కు పూరీ ఎలాంటి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటాడో చూడాలి. అటు పూరీకి, ఇటు అఖిల్ కు ఇద్దరికీ ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకం కానుండటంతో ఈ వార్త మరింత ఆసక్తికరంగా మారింది.
అసలే కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ లేకపోవడంతో ఈసారి హిట్ కొట్టే ఫ్యాన్స్ ముందుకొస్తానని అఖిల్ అన్నాడని స్వయంగా నాగార్జునే చెప్పాడు. ఇలాంటి టైమ్ లో మరి అఖిల్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే అఖిల్ ప్రస్తుతం ఓ యంగ్ డైరెక్టర్ తో సైలెంట్ గా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.