80 కాలం నాటి పాటలో సీతమ్మ!
సీతమ్మ పాత్రలో అమ్మడు అభినయించిన తీరుకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
By: Tupaki Desk | 27 Nov 2024 10:30 PM GMTబాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అనతి కాలంలోనే అమ్మడు వైవి థ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు చేరువైంది. అటుపై స్టార్ లీగ్ లోనూ అంతే వేగంగా చేరింది. చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుంది. `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో అలియా టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీతమ్మ పాత్రలో అమ్మడు అభినయించిన తీరుకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అటుపై తెలుగు సినిమా అవకాశాలు ఎన్నో వచ్చినా? మాతృ భాషకే ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో కలసి `లవ్ అండ్ వార్` లో నటిస్తోంది. ఇందులో విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నాడు. అయితే 80 కాలం నాటి సాంగ్ ని ఒకటి ప్లాన్ చేసారు. ఇందు కోసం ముంబైలో ప్రత్యేకంగా డిస్కో సెట్ వేసారు. బ్యాక్ గ్రౌండ్ లో `లైలా మే లైలా` పాట ప్లే అవుతుండగా దాదాపు 30 మంది బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లతో ఈ పాట చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
`లవ్ అండ్ వార్` లో అలియాభట్ ఎవరికి దక్కుతుంది? అన్నది సస్పెన్స్. పెళ్లైన తర్వాత భర్త రణబీర్ కపూర్ తో అలియాభట్ నటిస్తోన్న చిత్రమిది. అలాగే విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నాడు. ముగ్గురి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. సంజయ్ లీలా భన్సాలీ ఇలాంటి చిత్రాలు ఎంత ఎఫెక్టివ్ గా చేస్తారన్నది చెప్పాల్సిన పనిలేదు. మరి 80 కాలం నాటి సాంగ్ లో హీరోలిద్దరి సరసన ఆడిపాడుతుందా? లేక? రియల్ హాబ్బీతోనే ఈ పాటను ప్లాన్ చేసారా? అన్నది తెలియాలి.
80 కాలం నాటి హిందీ క్లాసిక్ సాంగ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే హిందీ పాటలు ఓ ట్రెండ్ ని సృష్టించాయి. అందులోనూ లైలా మే లైలా పాట గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి జనరేషన్ యువతికి సైతం కనెక్ట్ అయిన సాంగ్ అది. అలాంటి పాటలో అలియాభట్ పెర్పార్మెన్స్ ఎలా ఉంటుందన్నది చూడాలి.