అల్లు అర్జున్.. ఇప్పుడు ప్రభాస్ రూట్ లోనే..
ఇప్పుడు సుమారు ఐదేళ్ల తర్వాత పుష్ప రాజ్ గెటప్ నుంచి బయటకు వచ్చారు.
By: Tupaki Desk | 2 Feb 2025 9:30 AM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సీక్వెల్ కు మించిన విజయం సాధించారు. ఇప్పుడు సుమారు ఐదేళ్ల తర్వాత పుష్ప రాజ్ గెటప్ నుంచి బయటకు వచ్చారు.
అయితే బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటి? అన్న క్వశ్చన్ కు ఇంకా క్లారిటీ లేదు. పుష్ప 2: ది రూల్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లేదా తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎవరితో ముందు వర్క్ చేస్తారన్న విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
అదే సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. త్రివిక్రమ్ తో మూవీ విషయంలో పలు అప్డేట్స్ కూడా ఇచ్చారు నాగవంశీ. స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు కూడా వచ్చిందని ఆ మధ్య తెలిపారు.
అయితే త్రివిక్రమ్ తో మూవీ అయ్యాక.. అట్లీతో బన్నీ వర్క్ చేస్తారని టాక్ వినిపించింది. కానీ తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ ఒకేసారి రెండు చిత్రాలకు వర్క్ చేయడానికి అంగీకరించారని దిల్ రాజు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు.
పెద్ద హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు వరుసగా మరిన్ని చిత్రాల్లో నటించినప్పుడు మాత్రమే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే నిజమేనని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ మాత్రమే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నారు!
మిగతా కొందరు స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రెండు లేదా మూడేళ్లు కేటాయిస్తున్నారు. అయితే ప్రతి హీరో రెండు లేదా మూడు సంవత్సరాల పాటు ఒక సినిమా చేయడం కంటే ఎక్కువ మూవీస్ లో నటించాలి. అప్పుడే నిర్మాతలకు లాభాలు అందిస్తూ.. కార్మికులకు ఉపాధి కల్పించిన వారు అవుతారు. ఇప్పుడు అల్లు అర్జున్ దాన్ని అర్థం చేసుకున్నారని.. ప్రభాస్ రూట్ ను ఫాలో అవుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.