అన్నయ్య పాన్ ఇండియాలో తమ్ముడా?
బన్నీ ఈ మధ్య కాలంలో దుబాయ్ టూ హైదరాబాద్ ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 29 March 2025 10:30 PMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు దుబాయ్ లో జరుగుతున్నాయి. బన్నీ ఈ మధ్య కాలంలో దుబాయ్ టూ హైదరాబాద్ ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నాడు. బన్నీ కూడా అందుబాటులో ఉండాలని అట్లీ సూచించడంతో? బన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు .
అయితే తాజాగా అల్లు శిరీష్ కూడా దుబాయ్ వెళ్లి వచ్చినట్లు కాంపౌండ్ వర్గాల నుంచి ఓ లీక్ అందింది. దీంతో ఇప్పుడీ వార్త ఆసక్తికరంగా మారింది. అన్నయ్య సినిమాలో తమ్ముడు కూడా ఏదైనా కీలక పాత్ర పోషిస్తున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి శిరీష్ దుబాయ్ కి వెళ్లింది తన వ్యక్తిగత పనిమీదా? లేక ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అట్లీ పిలిపించాడా? అన్నది క్లారిటీ రావాలి. ఇది భారీ ప్రాజెక్ట్ .
సన్ పిక్చర్స్ వందల కోట్టు ఖర్చు చేస్తుంది. బన్నీపారితోషికంగానే 170 కోట్లకు పైగా చెల్లిస్తుంది. అది గాక లాభాల్లో వాటా కూడా ఇవ్వాల్సి ఉంది. అలాంటి ప్రాజెక్ట్ లో శిరీష్ భాగమవ్వడం అన్నది అంత సులభం కాదు. నేరుగా డైరెక్టర్ కోరుకుంటే తప్ప సాధ్యం కాదు. తమ్ముడి కోసం బన్నీ చనువు తీసుకుని అడిగేంత సన్నివేశం ఉండదు. అల్లు అరవింద్ కూడా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కారు.
అలా కల్పించు కోవాలనుకుంటే? 'పుష్ప' సినిమాలోనే ఏదో పాత్రలో ఇరికించేవారు. మరి శిరీష్ దుబాయ్ ట్రిప్ వెనుక అసలు కథ ఏంటి అన్నది తేలాలి. నిజంగా అట్లీ పిలిపిస్తే గనుక శిరీష్ జాతకం మారిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంత కాలంగా శిరీష్ సినిమాలు చేయడం లేదు. సరైన కథ కుదరక పోవడంతో? రిస్క్ తీసుకోవడం లేదు. మరి ఈ ఛాన్స్ నిజమైతే గనుక పంట పండినట్లే.