Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ కథలను ఇలానే చూపించాలా?

ఆయన పేరు మీదుగానే ఈ సినిమా తెలుగులోకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 2:02 PM GMT
ప్రశాంత్ నీల్ కథలను ఇలానే చూపించాలా?
X

దీపావళికి రాబోతున్న కన్నడ డబ్బింగ్ మూవీ ‘బఘీర’. ఉగ్రమ్ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజ్ స్టోరీ అందించారు. ఆయన పేరు మీదుగానే ఈ సినిమా తెలుగులోకి రాబోతోంది. అక్టోబరు 31న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మూడు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ కట్ చూస్తుంటే, సినిమాపై ప్రశాంత్ నీల్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది.

ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్.. KGF ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా ఖ్యాతిని గడించారు. ఆ తర్వాత ప్రభాస్ తో తీసిన 'సలార్' మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. బ్లాక్ థీమ్ లో నీల్ తీసిన ఈ మూడు సినిమాల్లోనూ.. ఎమోషన్స్, ఎలివేషన్స్, హీరోయిజాన్ని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లే హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ హైలైట్ నిలిచాయి. ఇప్పుడు ‘బఘీర’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనప్పటికీ.. సినిమాలో లావిష్ విజువల్స్, ప్రెజెంటేషన్ చూస్తే ఎవరికైనా ప్రశాంత్ నీలే గుర్తుకు వస్తాడు. చూస్తుంటే నీల్ ఇన్ పుట్స్ ఈ సినిమాలో ఉన్నట్లు అర్థమవుతుంది.

"బఘీర" సినిమాకి డాక్టర్ సూరి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ ట్రెయిలర్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో, తెలుగు ఆడియన్స్ దృష్టి పడింది. సమాజం కోసం ఒక హీరో ఉద్భవించడం అనే లైన్ మీద ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. బేసిక్ ఫ్లాట్ లో కొత్తదనం ఏమీ లేదు కానీ.. విజువల్స్, యాక్షన్ స్టంట్స్ మాత్రం అదిరిపోయాయి. టెక్నికల్ గానూ రిచ్ గా ఉంది.

ఇందులో శ్రీమురళిని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. పోలీసు అధికారిగా, మాస్క్ మ్యాన్ బఘీరాగా ఆకట్టుకున్నాడు. సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. మ్యూజిక్ డైరక్టర్ బి.అజనీష్ లోక్‌నాథ్ ఎప్పటిలాగే తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో యాక్షన్ ని ఎలివేట్ చేశాడు. ప్రశాంత్ నీల్ కలం నుంచి రాబోతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే 'సలార్ 1' తర్వాత ప్రశాంత్ నీల్ ఇంకా తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళలేదు. 'సలార్ 2' పూర్తి చేస్తారని అనుకున్నారు కానీ, ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.