Begin typing your search above and press return to search.

బాలయ్య ఏజ్ తగ్గుతుందా? పెరుగుతుందా?

కొన్నేళ్ల క్రితం వరుస డిజాస్టర్లతో సతమతమైన బాలకృష్ణ.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 12:08 PM GMT
బాలయ్య ఏజ్ తగ్గుతుందా? పెరుగుతుందా?
X

టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు ఉన్నారు. నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తన యాక్టింగ్ తో మెప్పిస్తూ ఆరు పదుల వయసులో కూడా దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. తనదైన శైలిలో నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. త్వరలో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


కొన్నేళ్ల క్రితం వరుస డిజాస్టర్లతో సతమతమైన బాలకృష్ణ.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు హిట్స్ అందుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు టాలెంటెడ్‌ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఆ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అటు కళాసేవ.. ఇటు ప్రజాసేవ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బాలయ్య. వరుసగా సినిమాల్లో యాక్ట్ చేస్తూనే.. ఏపీ హిందూపురం ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. రాజకీయాలు, ప్రజా సేవలో బిజీగా ఉంటున్నా.. సినిమాలు వదల్లేదు! ఇప్పుడు NBK 109 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఆయన లుక్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే బాలయ్య లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అందులో ఆయన పంచెకట్టుతో భలేగా కనిపిస్తున్నారు. ఆ పిక్స్ లో తెలుగుదనం ఉట్టిపడగా.. క్లీన్ షేవ్ తో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఫుల్ యంగ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటసింహం వయసు తగ్గుతుందా.. లేక పెరుగుతుందా అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. లైకుల కొడుతూ సందడి చేస్తున్నారు.

కాగా, పిల్ల పిల‌గాడు వెబ్‌ సిరీస్‌ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న సాయితేజ హీరోగా పైలం పిలగా సినిమా చేస్తున్నారు. సెప్టెంబర్ 20వ తేదీన విడుదల అవ్వనున్న తమ మూవీ ట్రైలర్ ను బాలయ్యకు చూపించారు మేకర్స్. ఆ సమయంలో విడుదల చేసిన పిక్స్ తో బాలయ్య లుక్ రివీల్ అయింది. అయితే నటసింహం స్టిల్ ఓ జ్యూవెలరీ యాడ్ లోనిదేని తెలుస్తోంది. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఉన్న ఆ యాడ్ ను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.