Begin typing your search above and press return to search.

చిరుతో మరోసారి - బాలీవుడ్ ఎంట్రీ.. బాబీ నెక్స్ట్ ప్లాన్స్!

బాలయ్య హీరోగా నటించిన ఆ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Feb 2025 9:36 AM GMT
చిరుతో మరోసారి - బాలీవుడ్ ఎంట్రీ.. బాబీ నెక్స్ట్ ప్లాన్స్!
X

బాబీ కొల్లి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఆయన ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. రీసెంట్ గా డాకు మహారాజ్ తో సూపర్ హిట్ అందుకున్నారు. బాలయ్య హీరోగా నటించిన ఆ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు వాల్తేరు వీరయ్యతో అందరినీ మెప్పించారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమా.. రెండేళ్ల క్రితం రిలీజ్ అయింది. మొత్తానికి ఇప్పటివరకు తన కెరీర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ తప్ప మిగతా అన్ని సినిమాలతో మెప్పించారు. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి పడింది. కానీ డాకు తర్వాత ఏ సినిమా చేస్తారన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే బాబీ.. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకు గాను ఇప్పటికే వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని, ఆ తర్వాత క్యాస్టింగ్ కోసం సెర్చ్ చేస్తారని వినికిడి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి బాబీ బాలీవుడ్ డెబ్యూ నిర్మించనున్నారని సమాచారం. అయితే మాస్ ఎంటర్టైనర్ లు తీయడంలో బాబీకి మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. దీంతో తన బాలీవుడ్ డెబ్యూ కోసం ఎలాంటి స్క్రిప్ట్ రాసుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది.

అదే సమయంలో చిరంజీవితో బాబీ మరో సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి విశ్వంభర తర్వాత బాబీతో చిరు మరోసారి వర్క్ చేయాల్సి ఉందట. కానీ స్కిప్ట్ రెడీ కాకపోవడంతోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిరు- అనిల్ మూవీ స్టార్ట్ కానుందని వినికిడి.

ఇంతలో బాబీ.. చిరుతో చేయాల్సిన ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయనున్నారని సమాచారం. ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా.. చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎప్పటినుంచో తన తండ్రితో కలిసి సినిమా నిర్మించాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. మరి బాబీ అప్ కమింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వార్తల్లో నిజమెంతో వేచి చూడాలి.