తారక్ - మహేష్ - ప్రభాస్.. వెళ్లిపోతున్నారా?
రోడ్లు మీద హ్యాపీగా తిరుగుతూ, షాపింగ్స్ చేస్తూ, నచ్చిన రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ జాలీగా గడపాలని అనుకుంటారు.
By: Tupaki Desk | 28 Dec 2024 12:01 PM GMTఎంత పెద్ద సెలబ్రెటీలు అయిన కూడా అందరిలాగే వారికి లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. రోడ్లు మీద హ్యాపీగా తిరుగుతూ, షాపింగ్స్ చేస్తూ, నచ్చిన రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ జాలీగా గడపాలని అనుకుంటారు. ఫ్యామిలీతో కలిసి బయట తిరగాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ హీరో వర్షిప్ ఎక్కువగా ఉంటుంది.
తమ అభిమాన హీరో ఎక్కడికి వచ్చిన వేలాది సంఖ్యలో అక్కడికి తరలివస్తారు. హీరోలు, హీరోయిన్స్ ని చూడటానికి పబ్లిక్ తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే మన స్టార్స్ కి ఇక్కడ పబ్లిక్ లైఫ్ ఉండదు. ఫ్యాన్స్ కారణంగా కుటుంబంతో కలిసి సంతోషంగా తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అందుకే మన హీరోలు అందరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడపడానికి విదేశాలు వెళ్ళిపోతూ ఉంటారు.
అలాగే ఏదైనా వీకెండ్ పార్టీలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఇండియాలో చేసుకునేంత స్వేచ్ఛ వారికి ఉండదు. అందుకే ఇష్టమైన కంట్రీ చూసుకొని ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన స్టార్ హీరోలు అందరూ కూడా విదేశాలలో తమ న్యూఇయర్ ని ప్లాన్ చేసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీ షూటింగ్ షెడ్యూల్ రీసెంట్ గా కంప్లీట్ చేశాడు. ఈ షూటింగ్ ముగించుకొని తారక్ ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు . అక్కడ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోబోతున్నాడని తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల తర్వాత మరల తిరిగి వస్తాడని టాక్. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు యూరప్, జర్మనీ దేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాడని సమాచారం.
కొద్ది రోజులు అక్కడి మంచు వాతావరణాన్ని కూడా కుటుంబంతో కలిసి ఆస్వాదించబోతున్నాడంట. డార్లింగ్ ప్రభాస్ రీసెంట్ గా గాయంతో ‘ది రాజాసాబ్’ షూటింగ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రభాస్ కూడా న్యూ ఇయర్ వేడుకలు విదేశాల్లోనే ప్లాన్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే చాలా మంది హీరోలు ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారంట
వీటికోసం సినిమా షూటింగ్ లని కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్తసంవత్సర వేడుకల తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని మరల షూటింగ్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. కొంతమంది హీరోలైన ఈ వేడుకలని ఇంట్లోనే కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.