Begin typing your search above and press return to search.

దేవర గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే పెద్దదా?

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియులతోపాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   13 Sep 2024 3:00 AM GMT
దేవర గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే పెద్దదా?
X

మాస్ డైరెక్టర్ కొరటాల శివతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు కొరటాల, తారక్ కాంబోలో తెరకెక్కిన దేవర పార్ట్-1 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియులతోపాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ సోలోగా యాక్ట్ చేసిన సినిమా సుమారు ఆరేళ్ల తర్వాత విడుదల అవుతుంది. దీంతో అందరి దృష్టి దేవరపై పడింది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ ప్రీ సేల్స్ క్రాస్ చేసి దేవర ఇప్పటికే అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. మూవీ టీమ్ అంతా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా దేవర నిర్మాతల్లో ఒకరైన హీరో కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన దృష్టిలో పాపులర్ ఇంగ్లీష్‌ సిరీస్‌ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కన్నా దేవర పెద్దదని తెలిపారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దేవర ఉత్తమంగా ఉంటుందని చెప్పారు. మూవీ కోసం 40 అడుగుల లోతులో ట్యాంకును తవ్వామని వెల్లడించారు. అందులో నీటి అడుగుభాగాన సీన్స్ ను షూట్ చేశామని పేర్కొన్నారు. సాబు సిరిల్ వేసిన సెట్ ను చూసి షాక్ అయిపోతారని చెప్పారు. గత ఏడాది నుంచి దేవర తప్ప మరే ప్రాజెక్ట్ కు ఆయన పనిచేయలేదని తెలిపారు.

తన బ్రదర్ ఎన్టీఆర్ కష్టం దేవర మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని కళ్యాణ్ రామ్ ధీమా వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం.. కొరటాల కూడా దేవరను గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పోల్చారు. అయితే దేవరను గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో మేకర్స్ పోల్చడంపై ఇప్పుడు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ కు తగ్గట్టుగా లేదని చెబుతున్నారు. చెప్పాలంటే.. కొరటాల మూవీ ఆచార్యకు దగ్గరగా ఉందని అంటున్నారు.

ఇక ట్రైలర్ ద్వారా.. తీరప్రాంతంలో భయం, ధైర్యం అనే అంశాల చుట్టూ సినిమా అంతా తిరుగుతున్నట్లు అర్థమవుతుంది. దాని బట్టి మూవీ కాన్సెప్ట్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ కు తగ్గట్టుగా లేదని చెబుతున్నారు. ఏదేమైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంశాన్ని మేకర్స్ ప్రమోషన్స్ లో బాగా యూజ్ చేస్తున్నారు. మరి దేవర సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.. మేకర్స్ క్రియేట్ చేసిన హైప్ ను అందుకుంటుందో వేచి చూడాలి.