Begin typing your search above and press return to search.

బిగ్ ప్రాజెక్ట్ మిస్.. అంతా దేవి శ్రీ ప్రసాద్ మంచికే..

ప్రస్తుతం పోటీదారులు వరుసగా సినిమాలు చేస్తూ రేసులో ఉంటే, దేవి మాత్రం తాను నమ్మిన సినిమాలకే పరిమితం అవుతుంటాడు.

By:  Tupaki Desk   |   19 March 2025 6:30 PM IST
బిగ్ ప్రాజెక్ట్ మిస్.. అంతా దేవి శ్రీ ప్రసాద్ మంచికే..
X

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నా, తను ఎంచుకునే ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ప్లాన్ ఫాలో అవుతుంటాడు. ప్రస్తుతం పోటీదారులు వరుసగా సినిమాలు చేస్తూ రేసులో ఉంటే, దేవి మాత్రం తాను నమ్మిన సినిమాలకే పరిమితం అవుతుంటాడు. గత ఏడాది పుష్ప 2 మ్యూజిక్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అతను, ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన తండేల్‌తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కానీ ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నుంచి దేవి తప్పుకోవడం, ఆ ప్రాజెక్టును జీవి ప్రకాష్ కుమార్ స్వీకరించడం చర్చనీయాంశమైంది. అజిత్, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ పై తమిళనాట మాత్రం ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. వింటేజ్ అజిత్‌ను తెరపై చూపించేందుకు దర్శకుడు అధిక్ రవిచందర్ ఎంతో కష్టపడ్డాడని టాక్. కానీ సినిమా ప్రమోషన్లు, విడుదలైన వీడియో సాంగ్స్ చూస్తుంటే, ఆడియెన్స్‌లో పెద్దగా ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. పైగా ఇది రెగ్యులర్ సినిమా అనే కామెంట్స్ వస్తున్నాయి.

మాస్ ఎలిమెంట్స్‌తో ఫుల్ ప్యాక్ అవ్వాల్సిన ఈ ప్రాజెక్టుకు మంచి మ్యూజిక్ బ్యాక్‌బోన్‌గా ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వచ్చిన లిరికల్ సాంగ్స్ చూసిన అభిమానులు సంగీతం పరంగా పెద్దగా ఎఫెక్ట్ లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే దేవిశ్రీ ప్రసాద్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. దేవి గతంలో కోలీవుడ్‌లోనూ పలు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించాడు. అజిత్ సినిమాలకు కూడా బీభత్సమైన మ్యూజిక్ ఇచ్చి అక్కడ కూడా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న దేవి గుడ్ బ్యాడ్ అగ్లీకి సెట్ అయ్యి ఉంటే మళ్లీ తమిళంలో బిగ్ స్కేల్ ఆల్బమ్ ఇచ్చే అవకాశం ఉండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ పుష్ప 2 బిజీ షెడ్యూల్ కారణంగా దేవి ఈ ప్రాజెక్టును వదిలేయడం జరిగిందని, పలు మనస్పర్థల వల్ల నిర్మాతలే తీసేశారని కామెంట్స్ వచ్చాయి. ఇది కొంతమందికి నిరాశ కలిగించినా, దేవి కెరీర్‌కు మాత్రం మంచిదే అని అంటున్నారు.

జీవి ప్రకాష్ కుమార్ కూడా గత కొన్నేళ్లుగా మంచి మ్యూజిక్ ఇస్తున్నాడనే విషయాన్ని కొట్టిపారేయలేం. అయితే సినిమాకి పక్కా మాస్ కంటెంట్ లేకపోతే, సంగీత దర్శకుడు ఎంత మంచి సంగీతం ఇచ్చినా వర్కౌట్ అయ్యే ఛాన్స్ తక్కువే. గుడ్ బ్యాడ్ అగ్లీకి జీవి ఇచ్చిన మ్యూజిక్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ సినిమాలు చేయాలని కొత్త దారిలో వెళుతున్న దేవి ఈ ప్రాజెక్టును వదిలేయడం వల్ల, అతనికి ఏ నష్టం జరగలేదని విశ్లేషకులు అంటున్నారు. పైగా, ప్రస్తుతం దేవి ఫోకస్ మొత్తం కంటెంట్ బేస్డ్ సినిమాల మ్యూజిక్‌పైనే ఉంది. అందులో కమ్ముల కుబేర ఒకటి. ఇటీవల వచ్చిన తండేల్ అతనికి మంచి బూస్ట్ ఇచ్చింది.

మొత్తానికి చూస్తే, గుడ్ బ్యాడ్ అగ్లీ ఆల్బమ్ ఆడియెన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ దేవి లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌కి ఈ సినిమా చేయకపోవడం వల్ల ఎలాంటి మైనస్ లేదని, పైగా అతని ప్రస్తుత కెరీర్‌కు ఇది మంచి డెసిషన్‌గానే కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 10న సినిమా విడుదల అయిన తర్వాత జీవి మ్యూజిక్ ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో చూడాలి.