Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ వాయిదా మంచిదే అంటున్నారా?

దీంతో ధ‌నుష్ అభిమానులంతా త‌దుప‌రి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 March 2025 5:00 AM IST
ఫ్యాన్స్ వాయిదా మంచిదే అంటున్నారా?
X

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ఈ మ‌ధ్య న‌ట‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వంలోనూ బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆయ‌న దర్శకత్వం వహించిన 'నీలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్', తెలుగులో 'జాబిలమ్మ నీకు అంతా కోపమా'గా రిలీజ్ అయింది. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల రాబ‌ట్ట‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో ధ‌నుష్ అభిమానులంతా త‌దుప‌రి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం 'ఇండ్లీక‌డై'. ఈ సినిమాపై మంచి అంచ‌నా లున్నాయి. ఈ చిత్రాన్ని అన్ని ప‌నులు పూర్తి చేసి ఏప్రిల్ 10 న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే ఇప్పుడీ సినిమా వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని కొత్త తేదీ అనుకుంటున్నారుట‌. అయితే ఏప్రిల్ 10న అజిత్ న‌టించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా రిలీజ్ అవుతుంది.

ఆ సినిమాతో పాటు 'ఇడ్లీ క‌డై' కూడా రిలీజ్ అయితే? కాస్త ప్ర‌తికూల‌త ఉండే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డ‌లేదు. షూటింగ్ పెండింగ్ లో ఉండ‌టం స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణ‌గా రిలీజ్ వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ వాయిదా వేయ‌డాన్ని ద‌నుష్ అభిమానులు వ్యూహాత్మ‌కంగా భావిస్తున్నారు.

అజిత్ సినిమాకు పోటీగా రిలీజ్ అవ్వ‌డం కంటే? పోటీ లేని రోజుల్లోనే రిలీజ్ అవ్వ‌డం ఉత్త‌మంగా భావి స్తున్నారు. ధ‌నుష్ సినిమాల‌కు మాస్ ఫాలోయింగ్ త‌క్కువ అన్న సంగ‌తి తెలిసిందే. పైగా 'ఇడ్లీ క‌డై' ఆ జాన‌ర్ సినిమా కూడా కాదు. పూర్తి డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ద‌ర్శ‌కుడిగా ధ‌నుష్ ఇంకా ఫాంలో కి రాలేదు. డైరెక్ట‌ర్ గా రాటు దేల‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంది. అంత వ‌ర‌కూ కాంపిటీష‌న్ జోలికి వెళ్ల‌కుండా ఉండ‌టమే మంచిదిగా అభిమానులు భావిస్తున్నారు.