Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో మిస్సవుతున్న ఎమోషన్..!

ఐతే సౌత్ సినిమాల్లో ఉన్నది బాలీవుడ్ సినిమాల్లో మిస్ అవుతున్నది ఏంటన్నది ఒకసారి చూస్తే ఆ లెక్క అర్ధమవుతుంది.

By:  Tupaki Desk   |   10 Dec 2024 4:15 AM GMT
బాలీవుడ్ లో మిస్సవుతున్న ఎమోషన్..!
X

ఒకప్పుడు పాన్ ఇండియా హిట్ సినిమాలంటే అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉండేవి. అక్కడ స్టార్స్.. అక్కడ సినిమాల గురించి నేషనల్ మీడియా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అలానే బాలీవుడ్ టైం అసలు ఇప్పుడు ఏమాత్రం బాగాలేదు. వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటే కనీసం పదుల సంఖ్యలో కూడా సక్సెస్ రేటు కనిపించట్లేదు. బాలీవుడ్ ఇచ్చిన ఈ చిన్న గ్యాప్ ని తెలుగు స్టార్స్ పాన్ ఇండియా హిట్లు కొడుతూ రచ్చ చేస్తున్నారు. ఐతే సౌత్ సినిమాల్లో ఉన్నది బాలీవుడ్ సినిమాల్లో మిస్ అవుతున్నది ఏంటన్నది ఒకసారి చూస్తే ఆ లెక్క అర్ధమవుతుంది.

సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు ఈమధ్య పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాయి. స్టార్ ఎవరైనా.. సినిమా ఎలాంటిదైనా.. బాలీవుడ్ ఆడియన్స్ ను కూడా కన్విన్స్ చేసే కథ కథనాలు మన వాళ్లు సెలెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ సినిమా అంటే ఎంత కమర్షియల్ గా ఉండాలి అన్నది చూస్తున్నారు కానీ అక్కడ వారి సినిమాల్లో పాత్రల్లో ఎమోషన్ వర్క్ అవుట్ అవుతుందా అన్నది చూడట్లేదు.

బాలీవుడ్ లో కూడా ఒకప్పుడ్ హీరోయిక్ ఎలివేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్, లవ్ ట్రాక్ ఇలా ప్రతి ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. అది ఆడియన్స్ కు బాగా ఎక్కడంతో అప్పట్లో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పటి బాలీవుడ్ సినిమాల్లో ఆ ఎమోషన్ అసలు కనిపించట్లేదు. అందుకే ఎమోషనల్ లెస్ కనెక్షన్ వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. టికెట్ కొని థియేటర్ లో కూర్చున్న ఆడియన్ ని మెప్పించడంలో బాలీవుడ్ మేకర్స్ విఫలమవుతున్నారు. ఇదే విషయంలో మన సౌత్ మేకర్స్ గట్టి పట్టు సాధించారు. సినిమాలో కథ కథనాలు ఎలా ఉన్నా హీరో క్యారెక్టరైజేషన్, అతని ఎమోషన్ బాగా ఎక్కిస్తున్నారు.

అందుకే సౌత్ సినిమాలు బాలీవుడ్ రేంజ్ లో కూడా వరుస సక్సెస్ లు అవుతున్నాయి. బాలీవుడ్ మేకర్స్ ఈ విషయాన్ని గుర్తించి యాక్షన్, కమర్షియల్ కాదు మిస్సైన ఆ ఎమోషనల్ యాంగిల్ పట్టుకుంటే మాత్రం అక్కడ కూడా వరుస హిట్లు పడే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా సౌత్ సినిమాలు హిందీలో ఆడినట్టుగా అక్కడ సినిమాలు సౌత్ భాషల్లో ఆడిన పరిస్థితి లేదు. హాలీవుడ్ సినిమాలు ప్రాంతీయ భాషల్లో రికార్డులు సృష్టించాయి కానీ హిందీ సినిమాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మారుతున్న ప్రేక్షకుల ఆలోచనని బట్టి బాలీవుడ్ మేకర్స్ కూడా తమ పంథా మార్చేసి సినిమాలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.