Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ కంటే హై రేంజ్ లో 'గేమ్ ఛేంజర్'

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ యూఎస్ మార్కెట్‌లో కూడా ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 1:19 PM GMT
పుష్ప రాజ్ కంటే హై రేంజ్ లో గేమ్ ఛేంజర్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' సినిమాపై మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ యూఎస్ మార్కెట్‌లో కూడా ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షోల సంఖ్యలు, వసూళ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' కూడా భారీ అంచనాలతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' వసూళ్ల పరంగా 'పుష్ప 2'ను మించి దూసుకెళ్తోంది.

రామ్ చరణ్‌కు 'RRR' తర్వాత యూఎస్ మార్కెట్‌లో భారీగా క్రేజ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ప్రభావం 'గేమ్ చేంజర్'పై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రీమియర్‌ షోలు ఇంకా ప్రారంభం కాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ స్థాయిలో వసూళ్లు రావడం విశేషం. దీంతో యూఎస్ ప్రేక్షకులు రామ్ చరణ్ సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. 'గేమ్ చేంజర్'కు ఇంకా 24 రోజులు సమయం ఉన్నప్పటికీ, ప్రీ బుకింగ్ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ప్రీమియర్‌ షోల రికార్డులలో గేమ్ చేంజర్ దూకుడు

యూఎస్ మార్కెట్‌లో షోల సంఖ్య 500లకు చేరుకున్న తర్వాత జరిగిన ప్రీ బుకింగ్స్‌ను పరిశీలిస్తే, 'గేమ్ చేంజర్' వసూళ్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 'పుష్ప 2' సినిమా 557 షోలతో $52K గ్రాస్‌ను రాబట్టగా, 'గేమ్ చేంజర్' 537 షోలతోనే $61K గ్రాస్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ స్టార్డమ్ బలాన్ని ఈ నంబర్లు స్పష్టంగా చాటుతున్నాయి. ఇది ప్రీ బుకింగ్ రికార్డుల్లో 'గేమ్ చేంజర్'కు మరింత పాజిటివ్ వైబ్‌ని తెచ్చిపెట్టింది.

'పుష్ప 2: ది రూల్'తో పోల్చుకుంటే 'గేమ్ చేంజర్' సినిమా స్పష్టమైన ఆధిక్యాన్ని చూపుతోంది. 'పుష్ప 2' 33 రోజుల ముందుగా ప్రీ బుకింగ్‌ ప్రారంభించినప్పటికీ, 'గేమ్ చేంజర్' కేవలం 24 రోజుల వ్యవధిలోనే భారీ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇది శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి మామూలుగా లేదని చెప్పొచ్చు. అందుకు తోడు రామ్ చరణ్ స్టార్డమ్ కూడా సినిమాకు భారీగా కలిసొచ్చే అంశం.

'ఇండియన్ 2' సినిమాతో ఇటీవల శంకర్ డిజాస్టర్ ను ఎదుర్కొన్నప్పటికీ గేమ్ ఛేంజర్ పైన ఆ ప్రభావం పెద్దగా పడలేదని అర్ధమవుతుంది. ఇక రామ్ చరణ్‌తో తొలిసారి పనిచేస్తున్నాడు. శంకర్ మేకింగ్‌లో ఉన్న విజువల్ గ్రాండియర్‌తో పాటు పొలిటికల్ డ్రామా అనే అంశం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

రామ్ చరణ్ 'RRR'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా అతని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా ప్రీ బుకింగ్‌లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూఎస్ మార్కెట్‌లో రామ్ చరణ్ సత్తా ఏ రేంజ్‌లో ఉందో ఈ వసూళ్ల ద్వారా స్పష్టమైంది. ఇంకా సినిమా విడుదలకు 24 రోజులు సమయం ఉండటంతో ఫైనల్ వసూళ్లు చాలా భారీగా నమోదవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.