Begin typing your search above and press return to search.

ఇలా కలిసొస్తే కలెక్షన్స్ కుమ్ముడేగా..!

నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 27 గురువారం రిలీజ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:40 AM GMT
ఇలా కలిసొస్తే కలెక్షన్స్ కుమ్ముడేగా..!
X

న్యాచురల్ స్టార్ నాని లక్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు తను పడాల్సిన కష్టం పడితే ఫలితం దానంతట అదే వస్తుంది అని నమ్మే హీరోల్లో నాని ఒకరు. సెట్స్ మీద ఉన్నప్పుడు సినిమాకు ఏది కావాలో అది ఇస్తూ సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా చేస్తున్న నాని. రిలీజ్ టైం ప్రమోషన్స్ తో కూడా సినిమా తప్పకుండా చూడాలి అనే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తాడు. తను ఎంచుకున్న కథల మీద ఉన్న నమ్మకం.. సినిమా అవుట్ పుట్ చూసి వచ్చిన కాన్ఫిడెన్స్ ఈ రెండు కలిసి ప్రమోషన్స్ లో నాని మాట్లాడే మాటలు.. చెప్పే విషయాలు చూస్తే సినిమా కచ్చితంగా చూడాలనిపిస్తుంది.

నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 27 గురువారం రిలీజ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఐతే సినిమా రిలీజైన టైం లో తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఐతే అవేవి నాని సరిపోదా శనివారం కలెక్షన్స్ మీద ప్రభవం చూపించలేదు. ఓ పక్క గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయినా కూడా నాని సినిమా వసూళ్లు అదిరిపోయాయి. ఇక ఈ ఫ్రై డే రిలీజైన విజయ్ గోట్ సినిమా కూడా అంత గొప్ప టాక్ తెచ్చుకోలేదు.

విజయ్ గోట్ సూపర్ హిట్ అయితే నాని సినిమా కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉండేది కానీ తెలుగులో గోట్ ప్రభావం అంతగా లేదని తెలుస్తుంది. సో రెండో వారం కూడా నానికి తిరుగు లేదని చెప్పొచ్చు. అంతేకాదు నాలుగు రోజులుగా వర్షాల వల్ల సినిమాకు వెళ్లడం కుదరని ఆడియన్స్ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఎలాగు శనివారం వినాయక చవితి కూడా వచ్చింది. సో అన్ని అంశాలు నానికి కలిసి వచ్చేలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వల్ల సుహాస్ జనక అయితే గనక, రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమాలు రిలీజ్ వాయిదా పడ్డాయి.

నాని సరిపోదా శనివారం లేదా విజయ్ గోట్ ఈ రెండు మాత్రమే పోటీ పడుతున్నాయి. గోట్ కి ఎలాగు టాక్ బాగాలేదు కాబట్టి సరిపోదా శనివారమే ఆడియన్స్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎలాగు వీకెండ్ హాలీడే కాబట్టి హిట్ సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది. అలా చూస్తే సరిపోదా శనివారం కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. దసరా తర్వాత నాని సరిపోదా శనివారం మరో 100 కోట్లు కలెక్ట్ చేసేలా ఉందని చెప్పొచ్చు.