హార్థిక్ (X) జాస్మిన్: ప్రేమ దోమ కుట్టిందిగా
ఆ సమయంలో మ్యాచ్ ని కవర్ చేసే కెమెరాలన్నీ జాస్మిన్ ఫీలింగ్స్ వైపే దృష్టి సారించాయి.
By: Tupaki Desk | 5 March 2025 11:01 PM ISTఒకరిపై ప్రేమ ఉంది అని చెప్పేందుకు కొన్ని సింప్టమ్స్ (లక్షణాలు) కనిపిస్తాయి. అలాంటి సింప్టమ్స్ హార్థిక్ - జాస్మిన్ వాలియా మధ్య కనిపించాయనేది విశ్లేషకుల మాట. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో వరుసగా సిక్సర్లు బాదిన హార్దిక్ పాండ్యాకు చీర్ లీడర్‌గా మారిన జాస్మిన్ వాలియా అందరి దృష్టిని ఆకర్షించింది. హార్థిక్ సిక్స్ కొట్టినప్పుడల్లా జాస్మిన్ స్టాండ్స్ లో నిలబడి కేరింతలు కొట్టింది. ఆ సమయంలో మ్యాచ్ ని కవర్ చేసే కెమెరాలన్నీ జాస్మిన్ ఫీలింగ్స్ వైపే దృష్టి సారించాయి.
ఆసిస్‌తో టీమిండియా మ్యాచ్‌లో హార్థిక్- జాస్మిన్ మధ్య ప్రేమాయణం అధికారికమైందని ఇప్పుడు అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. మ్యాచ్‌లో స్టాండ్స్ నుండి జాస్మిన్ నేరుగా హార్దిక్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించింది. వరుసగా సిక్సర్లు బాదడం సహా హార్దిక్ ప్రదర్శన భారత్ విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్ వీక్షిస్తున్న జాస్మిన్ తన స్నేహితులతో కలిసి వీఐపీ బాక్స్‌లో కూర్చుంది. 28 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన పాండ్యా తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఆస్ట్రేలియా లక్ష్యాన్ని భారత్ హాయిగా ఛేధించడంలో ఒత్తిడిని తగ్గించాడు. వరుసగా సిక్సర్లు బాదుతున్న తన అందగాడి కోసం చప్పట్లు కొడుతూ ఉత్సాహపరుస్తున్న జాస్మిన్ వైపు కెమెరాలు పదే పదే తిరిగాయి. అది చూసి అభిమానులు ఆశ్చర్యపోవడం కనిపించింది.
హార్దిక్ పాండ్యా దూకుడైన ఆట భారతదేశ విజయానికి దోహదపడింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత ఇప్పుడు చిన్నగా కసి తీర్చుకున్నట్టు కనిపించింది. ఇక అదే సమయంలో హార్థిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ సింపుల్ గా తన కుమారుడితో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్న వీడియో వైరల్ అయింది.
హార్దిక్ - జాస్మిన్ కొత్త ప్రేమకథ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఈ ప్రేమకథ గత సంవత్సరం నటాషా నుండి అతడు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే హెడ్ లైన్స్ లోకి వచ్చింది. గ్రీస్‌లో ఈ జంట రొమాంటిక్ డేట్ ఫోటోలను షేర్ చేసుకున్న తర్వాత ఈ ప్రేమకథ బహిర్గతమైంది. కొన్ని నెలలుగా హార్థిక్ ఆడే మ్యాచ్ లకు విచ్చేస్తోంది జాస్మిన్ వాలియా.