Begin typing your search above and press return to search.

ఇండియన్ 3.. అదే బెస్ట్ డెసిషన్ అనుకున్నారా..?

ఐతే ఇండియన్ 2 ఇచ్చిన షాక్ వల్ల ఇండియన్ 3 అంటే ఆడియన్స్ భయ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 2:44 PM GMT
ఇండియన్ 3.. అదే బెస్ట్ డెసిషన్ అనుకున్నారా..?
X

కమల్ హాసన్, శంకర్ ఈ కాంబోలో పాతికేళ్ల తర్వాత వచ్చిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించింది. ఎందుకో ఇండియన్ 2 సినిమాలో ఏది అసలేమాత్రం వర్క్ అవుట్ కాలేదు సరికదా సినిమా ఓటీటీ రిలీజ్ టైం లో ట్రోలర్స్ కి మంచి స్టఫ్ మెటీరియల్ అయ్యింది. ఇండియన్ 2 సినిమా రిలీజ్ తర్వాత ఇండియన్ 3 వస్తుందని చెప్పినా ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఐతే ఇండియన్ 2 ఎండింగ్ లో ఇండియన్ 3 ట్రైలర్ వదిలారు. ఆ ట్రైలర్ చూసిన ఆడియన్స్ అయితే కాస్త సర్ ప్రైజ్ అయ్యారు. ఐతే ఇండియన్ 2 ఇచ్చిన షాక్ వల్ల ఇండియన్ 3 అంటే ఆడియన్స్ భయ పడుతున్నారు.

అయినా సరే ఎలాగు సినిమా పూర్తి చేశాం కదా అని ఇండియన్ 3 ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు మేకర్స్. సినిమాను 2025 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే లేటెస్ట్ గా ఇండియన్ 3 మేకర్స్ ప్లాన్ లో మార్పు చేసినట్టు తెలుస్తుంది. ఇండియన్ 3 సినిమాను థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. నెట్ ఫ్లిక్స్ ఆల్రెడీ ఇండియన్ 3 రైట్స్ సొంతం చేసుకుంది. అందుకే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కే టీం ప్లాన్ చేస్తున్నారట.

ఓటీటీ రిలీజ్ అయితే కలెక్షన్స్ గొడవ.. టాక్ గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. నచ్చిన వాళ్లు.. నచ్చినన్నిసార్లు చూసుకుంటారు. ఐతే నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇండియన్ 3 డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ని బాగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ ముందే రైట్స్ భారీ ధరకు కొన్నారు కాబట్టి దాన్ని రికవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కూడా ఇండియన్ 3 సినిమాను నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ షెడ్యూల్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇండియన్ 3 సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. దాదాపు పార్ట్ 2, 3 రెండు కలిసి వందల కోట్లు ఖర్చు అయ్యింది. ఆ లెక్కన ఇండియన్ 3 సినిమా కనీసం తక్కువలో తక్కువ 100 కోట్లు పైనే అయ్యిందని తెలుస్తుంది. సో నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కూడా ఆ రేంజ్ లో డీల్ సెట్ చేసుకున్నారు కాబట్టే ఓటీటీ రిలీజ్ కైనా మేకర్స్ ఓకే అనేస్తున్నారని తెలుస్తుంది. ఇండియన్ 3 సినిమాలో కమల్ హాసన్ తో పాటు కాజల్ కూడా నటించింది.