ప్రభాస్ తో 'పౌజీ'..నదులన్నీ సముద్రంలో కలవాల్సిందే!
ప్రభాస్ తో సినిమా చేయాలంటే భారీ క్వాలిఫికేషన్లు అవసరం లేదు.
By: Tupaki Desk | 1 Feb 2025 2:30 PM GMTనేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే టాప్ 5 హీరోల్లో అతనొకరు. అతడి రేంజ్ ఏంటో అతనికి తెలియదని ఫస్ట్ క్లాస్ డైరెక్టర్లు అంతా చెబుతుంటారు. అంటే అదీ ప్రభాస్ సింప్లిసిటీ. అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. ఎంతో డౌన్ టౌ ఎర్త్. అలాంటి హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ స్టార్ డైరెక్టర్ అనుకుంటారు. ప్రభాస్ తో సినిమా చేయాలంటే భారీ క్వాలిఫికేషన్లు అవసరం లేదు.
మంచి సినిమా చేసి సక్సెస్ అందుకుంటే? చాలు మారుతికి అవకాశం ఇచ్చినట్లు డార్లింగ్ ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి 'రాజాసాబ్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే హను రాఘవ పూడితో కలిసి 'పౌజీ' చిత్రాన్ని కూడా చేస్తున్నారు. భారీ పిరియాడిక్ వార్ లవ్ స్టోరీ. 1800 కాలం నాటి స్టోరీ. అప్పటి యుద్ద వీరులు ఎలా ఉండేవారో? ప్రభాస్ ని తెరపై అలా మలుస్తున్నాడు హను.
సినిమాపై ఉన్న అంచనాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. లవ్ కమ్ వార్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో? అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే హనురాఘవ పూడి చిత్రాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తారా? అని హనుని అడిగితే...' రియాల్టీ ఉండాలి. అసలు ఊహకి కూడా అందదు. నాతో సాధ్యం కాదు. అసలు అది జరిగేదేనా? అని అప్పట్లో ఓ షాకింగ్ లా మాట్లాడారు హను.
కానీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు? ఇది ఇలా ఎలా జరిగింది? అంటే హను ఇలా స్పందించారు. 'ప్రభాస్ తో పనిచేయడం అన్నది ఎవరికైనా అదృష్టం లాంటింది. ఎన్ని నదులైనా వెళ్లి చివరికి సముద్రంలో కలవాల్సిందే. అలా ఎంత మంది హీరోలతో ఎంత మంది డైరెక్టర్లు సినిమాలు చేసినా? చివరిగా ప్రభాస్ తో కూడా సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. కాకపోతే నాకు ఆ ఛాన్స్ తొందరగా వచ్చిదనుకుంటున్నాను. అందుకు కారణంగా డెస్టినేషన్ అని నమ్ముతాను' అని అన్నారు.