కెన్యా అడవులకు మహేష్..?
ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ మూవీలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా లాక్ అయ్యింది.
By: Tupaki Desk | 1 Feb 2025 3:45 AM GMTసూపర్ స్టార్ మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాపై సోషల్ మీడియాలో హంగామా ఒక రేంజ్ లో ఉంది. మహేష్ బాబుతో సినిమా కోసం రాజమౌళి ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఈ కాంబో సినిమా బడ్జెట్టే 1000 కోట్లు పెట్టేస్తున్నారని టాక్. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ మూవీలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా లాక్ అయ్యింది. ఇప్పటికే మహేష్ బాబు తో రాజమౌళి వర్క్ షాప్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని చిత్ర యూనిట్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు రాజమౌళి. అందుకే లొకేషన్ లో హీరోతో సహా ఎవరు కూడా ఫోన్ కూడా వాడకూడదని కండీషన్ పెట్టాడట. అంతేకాదు కథ గురించి కానీ సినిమా షూటింగ్ ఏం జరుగుతుంది అన్న దాని గురించి కానీ అసలు ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడట జక్కన్న. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది.
ఆ తర్వాత విజయవాడ దగ్గరలో ఒక సెట్ వేయగా అక్కడ షూటింగ్ జరుగుతుందట. ఆ తర్వాత కెన్యా అడవులకు షూటింగ్ షిఫ్ట్ చేస్తారని తెలుస్తుంది. ఐతే ఇక్కడ షూటింగ్ అవ్వగానే ప్రెస్ మీట్ పెట్టి సినిమా మొత్తం కాస్ట్ అండ్ క్రూని ఎనౌన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. సో రాజమౌళి అంతా ప్లాన్ ప్రకారమే SSMB 29 ని షురూ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా కోసం మహేష్ 3 ఏళ్లు తన టైం ఇచ్చాడని తెలుస్తోంది. ఐతే సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2027 లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాలో పీసీ యాడ్ అవ్వడం హాలీవుడ్ లో సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. సో ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే స్కెచ్ వేశాడు. మరి ఈ సినిమా గురించి జక్కన్న వేస్తున్న ఒక్కో స్టెప్ సినిమాపై అంచనాలు పెంచడమే కాదు ఫ్యాన్స్ కి ఫ్యూజులు అవుటయ్యేలా ఉన్నాయి. మహేష్ రాజమౌళి కరెక్ట్ టైం లో కరెక్ట్ కాంబో సినిమా చేస్తున్నారు. మరి ఆకాశమే హద్దు అనేలా ఉన్న ఈ కాంబినేషన్ సినిమా ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంది అన్నది చూడాలి.