మోహన్ బాబు ఇండియాలో లేరా?
అందుకే ఆయన్ను కచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Dec 2024 6:18 AM GMTజర్నలిస్ట్‌పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని కోర్టు స్టే విధించింది. ఈనెల 24 వరకు మోహన్ బాబును అరెస్ట్ చేయవద్దు అంటూ స్టేలో పేర్కొంది. స్టే గడువు పూర్తి అయ్యేప్పటి వరకు ముందస్తు బెయిల్‌ను మోహన్‌బాబు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. కానీ కోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కొట్టి వేయడంతో అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. హత్యాయత్నం కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. అందుకే ఆయన్ను కచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
స్టే గడువు పూర్తి అయ్యింది, అలాగే ఆయనకు ముందస్తు బెయిల్ రాకపోవడంతో డిసెంబర్ 25న మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు ఇండియాలో లేరు అనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన దుబాయ్‌కి వెళ్లి పోయారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు. సోషల్ మీడియాలో ఈ విషయమై ఎవరికి తోచిన విధంగా వారు పోస్ట్‌లు చేస్తున్నారు. దాంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మోహన్ బాబు అరెస్ట్ కావడం ఖాయం అనే చర్చ జరుగుతున్న సమయంలో దుబాయ్‌కి వెళ్లి పోయాడు అనే విషయం నిజం అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కొందరు మాత్రం మోహన్ బాబు దుబాయ్‌కి వెళ్ళి పోయారు అనే వార్తలు కేవలం పుకార్లు అయి ఉంటాయని అంటున్నారు. ఒకవేళ దుబాయ్‌కి మోహన్‌బాబు వెళ్లి పోతే పోలీసులు ఏం చేస్తారు అనే చర్చ సైతం మొదలైంది. మరికొన్ని గంటల్లో మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. అప్పుడు జరిగే పరిణామాలు ఏంటి అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరో వైపు మోహన్ బాబు తనయుల గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. తన అన్న విష్ణు కారణంగా తనకు ప్రాణహాని ఉంది అంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలా మంచు వారి ఫ్యామిలీ గొడవలు రోడ్డున పడటంతో మీడియా వారు మోహన్ బాబు స్పందన అడిగిన సమయంలోనే మీడియా మైక్ లాక్కుని మరీ టీవీ 9 జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు స్వయంగా వెళ్లి జర్నలిస్ట్‌ను కలిసి క్షమాపణలు చెప్పారు. అయినా వివాదం కంటిన్యూ అవుతోంది. మోహన్ బాబు అరెస్ట్ అయితే కచ్చితంగా పెద్ద సంచలం.