Begin typing your search above and press return to search.

న‌య‌న‌తార అక్క‌...కియారా ప్రియురాలా!

అయితే ఎవ‌రు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు.

By:  Tupaki Desk   |   10 Jan 2025 6:30 AM GMT
న‌య‌న‌తార అక్క‌...కియారా ప్రియురాలా!
X

రాకింగ్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ కాన్వాస్ పై 'టాక్సిక్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదీ డ్ర‌గ్స్ మాఫియా స్టోరీ. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు...య‌శ్ లుక్ ప్ర‌తీది అంచనాలు పెంచేస్తుంది. క‌రీనా క‌పూర్, కియారా అద్వాణీ, న‌య‌న‌తార లాంటి స్టార్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. అయితే ఎవ‌రు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు. ఫీమేల్స్ ప‌రంగా ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చిన భామ‌ల పేర్లు.

ప్రాజెక్ట్ లో ఇంకా ఇంకెంత మంది భామ‌లు యాడ్ అవుతున్నారు? అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే వీళ్ల‌లో య‌ష్ కి జోడీగా ఏ భామ న‌టిస్తుంది? అన్న‌ది తెలియ‌దు. తొలుత క‌రీనా క‌పూర్ పేరు వినిపించింది. ఆ త‌ర్వాత మ‌రో భామ పేరు తెర‌పైకి వ‌చ్చింది. అయితే తాజాగా మ‌రో విష‌యం లీకైంది. సినిమాలో న‌య‌న‌తార హీరో పాత్ర‌కి అక్క‌గా న‌టి స్తుందిట‌. అలాగే కియారా అద్వాణీ ప్రియురాలి పాత్ర పోషిస్తుంద‌ని స‌మాచారం.

రిలీజ్ అయిన టీజ‌ర్ లో మాత్రం ఎలాంటి హింట్ ఇవ్వ‌లేదు. కేవ‌లం య‌శ్ కి సంబంధించిన ఎలివేష‌న్ మాత్రమే హైలైట్ చేసారు. క‌రీనా, న‌య‌న్, కియారాల‌ను కూడా హైడ్ చేసారు. ఈ నేప‌థ్యంలో ఆ పాత్ర‌ల‌పై ఆస‌క్తి అంత‌కంత‌కు పెరిగి పోతుంది. అలాగే సినిమాలో విల‌న్ పాత్ర‌ల‌పై కూడా స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. న‌టీన‌టులకు సంబంధించిన చాలా వివ‌రాలు మేకర్స్ గోప్యంగానే ఉంచారు. బ‌య‌టకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌కటించారు. దీంతో షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తు న్నారు. అయితే షూటింగ్ అప్ డేట్స్ మాత్రం అందించ‌డం లేదు. ఆ విష‌యాల్లో సైతం మేక‌ర్స్ గోప్య‌త వహిస్తున్నారు. మ‌రి ప్ర‌క‌టించిన తేదీకి చిత్రాన్ని రిలీజ్ చేస్తారా? లేదా? అన్న‌ది చూడాలి.