రుద్ర కాదు.. NKR21 టైటిల్ ఇదే!
కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.
By: Tupaki Desk | 5 March 2025 4:00 AM ISTనందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన కళ్యాణ్ రామ్, ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.
బింబిసార, డెవిల్ సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులను ట్రై చేస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. NKR21 కోసం కళ్యాణ్ చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ ప్రతీ విషయంలో కేర్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.
అశోక్ క్రియేషన్స్ బ్యానర్ లో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ ఓ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ ను మేకర్స్ అనుకుంటున్నారట.
ముందు ఈ సినిమాకు టైటిల్ గా మెరుపు అనే టైటిల్ ను అనుకున్నారని వార్తలొచ్చాయి. తర్వాత ఈ కథకు రుద్ర అనే టైటిల్ సరిగా సరిపోతుందని మేకర్స్ ఆ టైటిల్ ను పరిశీలిస్తున్నారన్నారు. అఖరికి అన్ని టైటిల్స్ ను పరిశీలించిన చిత్ర యూనిట్ అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఫైనల్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నన్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ అవుట్‌పుట్ నెక్ట్స్ లెవెల్ లో వచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.