Begin typing your search above and press return to search.

పూజా ఫ్యాన్స్ పూజలు ఫలించలేదు..!

డీజే సినిమా తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ కిరీటం దక్కించుకున్న పూజా హెగ్డేకి కాలం ఎక్కువ కాలం కలిసి రాలేదు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 1:15 PM IST
పూజా ఫ్యాన్స్ పూజలు ఫలించలేదు..!
X

టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో అతి తక్కువ సమయంలోనే సినిమాలు చేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఒకానొక సమయంలో స్టార్‌ హీరోలతో సినిమాలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా పూజా హెగ్డే సినిమాలు చేసింది. పూజా హెగ్డే కోసం ఒకరు ఇద్దరు హీరోలు, దర్శకులు సినిమాలను వాయిదా వేసుకుని ఆమె డేట్లకు తగ్గట్లుగా షూటింగ్‌ పెట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయని అంటారు. డీజే సినిమా తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ కిరీటం దక్కించుకున్న పూజా హెగ్డేకి కాలం ఎక్కువ కాలం కలిసి రాలేదు. ఆమెకి టాలీవుడ్‌లో బ్యాడ్‌ టైం నడిచింది. ఆ సమయంలో బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదు.

రెండేళ్ల పాటు పెద్దగా సినిమాలు లేకుండానే కేవలం ఫోటో షూట్స్‌తో నెట్టుకు వచ్చిన పూజా హెగ్డేకి అనూహ్యంగా మరో అవకాశం అన్నట్లుగా మూడు నాలుగు సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ముఖ్యంగా ఈ అమ్మడు హిందీలో చేసిన 'దేవా' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. షాహిద్‌ కపూర్‌ హీరోగా రూపొందిన దేవా సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపుగా రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన దేవా సినిమాకు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.5 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. లాంగ్‌ రన్‌లో సినిమా కనీసం పాతిక కోట్ల రూపాయల వసూళ్లు అయినా రాబట్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దేవా సినిమా హిట్ అయితే పూజా హెగ్డేకి బాలీవుడ్‌లో మరో రెండు మూడు ఆఫర్లు అయినా దక్కేవి. కానీ దేవా సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనింగ్ డే వసూళ్లను చూస్తే లాంగ్‌ రన్‌ వసూళ్లపై ఒక క్లారిటీ వచ్చేసింది. షాహిద్ కపూర్ వంటి యంగ్‌ స్టార్‌ హీరో నటించిన సినిమాకు ఇలాంటి ఓపెనింగ్ పడ్డాయంటే సినిమా ఫలితం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఫలితంతో పూజా హెగ్డే మరోసారి ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సి రావచ్చు అనే అభిప్రాయంను మీడియా వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

పూజా హెగ్డేకి దేవా సినిమాతో సక్సెస్ దక్కాలని అభిమానులు పూజలు చేశారు. ఆ పూజలు ఫలించలేదు. దేవా సినిమా ఫ్లాప్‌తో ఇప్పుడు తమిళ్‌లో ఈమె చేస్తున్న సూపర్ స్టార్‌ విజయ్ మూవీతో పాటు సూర్యతో చేస్తున్న రెట్రో సినిమాపై అంచనాలు పెట్టుకుంది. మరి ఈ రెండు సినిమాలైనా పూజా హెగ్డేకి హిట్ తెచ్చి పెట్టేనా అనేది చర్చనీయాంశంగా ఉంది. తెలుగులో ప్రస్తుతానికి ఈ అమ్మడికి ఒక్క ఆఫర్‌ కూడా లేదు. కానీ దేవా హిట్ అయ్యి ఉంటే, లేదా ప్రస్తుతం తమిళ్‌లో రూపొందుతున్న రెట్రో లేదా విజయ్‌ సినిమాలు హిట్‌ అయితే కచ్చితంగా టాలీవుడ్‌లో పూజా హెగ్డే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.