స్నేహితుడి వెంటే ప్రభాస్.. రూమర్స్ కి చెక్..!
అప్పటి నుంచి ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.
By: Tupaki Desk | 10 Oct 2024 9:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ తో సత్తా చాటుతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. బాహుబలి ముందు ప్రభాస్ ఇమేజ్ ఒకలా ఉంటే ఆఫ్టర్ బాహుబలి అది వేరే లెవెల్ కి చేరుకుంది. బాహుబలి తో ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు. అప్పటి నుంచి ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. సాహో, రాధే శ్యాం, ఆదిపురుష్ నిరాశపరచినా సలార్ 1, కల్కి మళ్లీ నిలబెట్టాయి.
ఈమధ్యనే రిలీజైన కల్కి సినిమా తో మరోసారి ప్రభాస్ మాస్ స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యింది. ఐతే తన రేంజ్ పెరిగింది కదా అని అనవసర బిల్డప్ లు ప్రభాస్ ఇవ్వడు. ముఖ్యంగా స్నేహితుల విషయంలో అతను చాలా బాధ్యతగా ఉంటాడు. ప్రభాస్ తో కేవలం పరిచయం ఉన్న వారే అతన్ని డార్లింగ్ అంటారు. అలాంటిది ప్రభాస్ స్నేహితులను ఎలా చూసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఐతే ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాక తన స్నేహితుడు నటుడు ప్రభాస్ శ్రీనుని పట్టించుకోలేదన్న టాక్ వచ్చింది.
ప్రభాస్ కి శ్రీను దూరమయ్యాడన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అంతేకాదు ఈమధ్య ప్రభాస్ శ్రీనుకి సినిమాలు కూడా చాలా తక్కువ అయ్యాయి. సో ప్రభాస్ తో ప్రభాస్ శ్రీను టచ్ లో ఉన్నాడా.. అసలు వాళ్లిద్దరు మాట్లాడుతున్నారా లేదా అన్న డౌట్ మొదలైంది. కానీ రీసెంట్ గా ఆ డౌట్లన్నిటికీ క్లారిటీ వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి ఈమధ్యనే మృతి చెందగా ఆయనకు ధైర్యం చెప్పేందుకు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు ప్రభాస్. ఆ టైం లో ప్రభాస్ తో పాటు ప్రభాస్ శ్రీను కూడా కనిపించాడు.
ఇదివరకు ప్రభాస్ ఎక్కడ ఉంటే అక్కడ కనిపించే ప్రభాస్ శ్రీను ఈమధ్య ప్రభాస్ తో కనిపించలేదు. అందుకే వీరిమధ్య దూరం పెరిగిందని అనుకున్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లిన ప్రభాస్ తో పాటుగా తన స్నేహితుడు ప్రభాస్ శ్రీను కూడా ఉన్నాడు. సో ఈ క్లారిటీ తో ప్రభాస్ ఎలాంటోడో మరోసారి ఫ్యాన్స్ కు అర్థమవుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ శ్రీను సినిమాలు ఎందుకు తగ్గించాడో తెలియదు కానీ ప్రభాస్ వెంటే తాను అని మరోసారి తన స్నేహితుడితో కనిపించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.