టాలీవుడ్ స్టార్స్ అందరిలో భయం భయం..?
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు A11 గా ఉన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు.
By: Tupaki Desk | 14 Dec 2024 11:00 AM GMTప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ వరకు అందరూ ఈ అరెస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి వెళ్లడం. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందడం సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు A11 గా ఉన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు.
ఇది సినీ, రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ సందర్భంగా ప్రీమియర్ షోలో ప్రీరిలీజ్ ఈవెంట్ పైన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం నోవొటెల్ లో ఏర్పాట్లు చేస్తే అభిమానులని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో ఈవెంట్ ని రద్దు చేయాల్సి వచ్చింది. ప్రీమియర్ షోలకి కూడా విపరీతంగా అభిమానుల తాకిడి ఉంటుంది. టికెట్ ధరలు ఎంత పెట్టిన ప్రత్యేకంగా కొన్ని థియేటర్స్ దగ్గర విపరీతమైన జనసందోహం ఉంటుంది.
ఆ సమయంలో అభిమానులని నియంత్రించడం పోలీసులకి సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇక స్టార్స్ వస్తున్నారు అంటే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఇప్పుడు రేవతి మరణం ఇండస్ట్రీ వర్గాలలో ఒక చర్చకి దారితీసింది. రాజకీయ కార్యక్రమాలకి జనాల తాకిడి ఎలా ఉంటుందనేది పోలీసులకి ఒక అంచనా ఉంటుంది. అయితే సినిమా ఈవెంట్స్ కి ఎంత మంది వస్తారనేది చెప్పలేని విషయం. దీంతో పోలీసులు ఎంత బందోబస్తు ఏర్పాటు చేసిన అభిమానులని కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహించకపోయిన సినిమాపై హైప్ ఉన్నప్పుడు ప్రేక్షకులు ఆటోమేటిక్ గా థియేటర్స్ కి వస్తారు. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్స్ ని ఇకపై నిర్వహించకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే ప్రీమియర్ షోల వలన అదనపు అడ్వాంటేజ్ అయితే ఏమీ ఉందు. ఒక అభిమానులని దృష్టిలో ఉంచుకొని వీటిని వేస్తూ ఉంటారు. వీటికోసం ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలి.
గ్లామర్ ప్రపంచంలో ఉన్న నటీనటులు తెరపై ఎంత గంభీరమైన పాత్రలు చేసిన నిజజీవితానికి వచ్చేసరికి వారు కూడా పబ్లిక్ లో భాగమే. వారికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కుటుంబాలు ఉంటాయి. ఈవెంట్స్ వలన వారికి ప్రత్యేకంగా వచ్చే లాభమేమీ ఉండడం లేదనేది చాలా మంది మాట. అందుకే ఇకపై సినిమాప్రీరిలీజ్ ఈవెంట్స్ ని పబ్లిక్ మీటింగ్స్ గా నిర్వహించకపోవచ్చని అనుకుంటున్నారు.
స్టార్స్ కూడా ఫ్యాన్స్ ను కలవాలి అంటే ఇప్పుడు భయం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. పొరపాటున ఏం జరిగినా స్టార్స్ లీగల్ గా ఇబ్బందులు ఎదుర్కోవడమో లేదంటే ఘటనలు జరిగినా లేని పోనీ విమర్శలు రావచ్చు. ఫ్యాన్స్ కి ఏం జరిగినా తట్టుకోలేని హీరోలు కూడా ఉంటారు. ఇక వారి క్షేమం కోరుకునే ఫ్యాన్స్ నెక్స్ట్ టైమ్ భారీ ఈవెంట్స్ చేసేందుకు కాస్త భయపడే అవకాశం ఉంది. అలాగే ప్రీమియర్ షోలు కూడా వేయకపోవచ్చని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత వీటిపై మేకర్స్ పునరాలోచనలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.