Begin typing your search above and press return to search.

పీసీ పిచ్చెక్కించేందుకు రెడీ..!

ఇండియన్ సినిమా ఆఫర్లు వస్తున్నా కూడా ఒక్క దానికి కూడా అమ్మడు ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   16 Jan 2025 7:30 AM GMT
పీసీ పిచ్చెక్కించేందుకు రెడీ..!
X

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయిన అందాల భామ ప్రియాంక చోప్రా ఇంగ్లీష్ సినిమాలు, సీరీస్ లు చేసుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది. ఇండియన్ సినిమా ఆఫర్లు వస్తున్నా కూడా ఒక్క దానికి కూడా అమ్మడు ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. 2015 లో బాజీరావ్ మస్తాని, 2016లో జై గంగాజల్ సినిమాల్లో నటించిన ప్రియాంక చోప్రా ఆ నెక్స్ట్ ఇయర్ బేవాచ్ ఛాన్స్ అందుకుని హాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి అమ్మడికి తిరుగు లేని విధంగా క్రేజ్ తెచ్చుకుంది.

నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత ప్రియాంక పూర్తిగా హాలీవుడ్ కే పరిమితమైంది. ప్రియాంక చోప్రా ని హిందీ మేకర్స్ కన్సల్ట్ అయినా కూడా ఆమె చేయలేనని చెప్పడం కామన్ అయ్యింది. హాలీవుడ్ వెళ్లాక బాలీవుడ్ ని చిన్న చూపు చూస్తుందని కొందరు హడావిడి చేసినా కూడా వాటిని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకుంది అమ్మడు.

ఆఫ్టర్ లాంగ్ టైం ప్రియాంక చోప్రా ఒక ఇండియన్ సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో అమ్మడు నటిస్తుందని టాక్. ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తే గ్లోబల్ వైజ్ గా ఈ ప్రాజెక్ట్ కి క్రేజ్ వస్తుంది.

ఐతే ఈమధ్య హిందీ సినిమాలకే తాను ఓకే చెప్పని ప్రియాంక మహేష్ సినిమాకు ఓకే చెబుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ 29వ సినిమానే కాదు ప్రియాంక చోప్రా జోనస్ బ్రదర్స్ చేస్తున్న సినిమాలో కూడా నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుంది. మరి భర్తతో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ప్రియాంక చోప్రా సినిమా కోసం ఇండియన్ సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి SSMB 29 సినిమాలో ప్రియాంక నటిస్తుందా లేదా. అసలు ఈ సినిమా ఆఫర్ అమ్మడిదాకా వెళ్లిందా లేదా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. పీసీ మాత్రం హాలీవుడ్ లో ఫాం ని ఇండియన్ స్క్రీన్ మీద కొనసాగించాలని చూస్తుంది. అది నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.