పూరి కంబ్యాక్ 'ఆటోజానీ'తోనేనా?
ప్రధమార్ధం కథ వరకూ ఒకే ..కానీ ద్వితియార్ధంలో చిరు మార్పులు కోరారు.
By: Tupaki Desk | 24 Dec 2024 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జరగాల్సింది. కానీ అప్పుడది సాధ్య పడలేదు. పూరి వద్ద సరైన కథ సిద్దంగా లేకపోవడంతో? 150 ఛాన్స్ వి.వి.వినాయక్ కు వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిరంజీవితో సినిమా కోసం పూరి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఆటోజానీ' స్టోరీ వినిపించారు. ప్రధమార్ధం కథ వరకూ ఒకే ..కానీ ద్వితియార్ధంలో చిరు మార్పులు కోరారు. కానీ ఆ మార్పులతో పూరి మళ్లీ అప్రోచ్ అవ్వలేదు.
అలా సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈప్రోసస్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్లతో సినిమాలు చేసారుగానీ పూరి తో మాత్ర పట్టాలెక్కలేదు. చివరిరికి చిరంజీవి కోరడంతో గాడ్ ఫాదర్ సినిమాలో పూరి నే ఓచిన్న గెస్ట్ పోషిం చారు. అన్నయ్య మాట కాదనలేక పూరి తొలిసారి ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆ బాండింగ్ అలాగే ఉందని అభిమానులకు అర్దమైంది. అయితే పూరి ఇప్పుడు మళ్లీ 'ఆటోజానీ'ని తెరపైకి తెస్తున్నట్లు పూరి సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తుంది.
మెగాస్టార్ కోరిక మేరకు 'ఆటోజానీ' కథ ద్వితియార్ధంలో మార్పలు చేస్తున్నారుట. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కి సంబంధిం చిన పనులు ప్రారంభించారుట. గోపీచంద్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ కథ సిద్దమై రెడీగా ఉందిట. కానీ సెట్స్ కి వెళ్లడానికి మరో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందిట. ఈ గ్యాప్ లో 'ఆటోజానీ' కథలో మార్పు లకు కలం పట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి ఫోకస్ అంతా ఆ సినిమాపైనే ఉందని అంటున్నారు. స్టోరీలు రాయడంలో పూరి వెరీ పాస్ట్.
అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ఎక్కువగా సమయం తీసుకుని రాసినా? తీసుకోకుండా రాసినా? సరైన లైన్ దొరికిందంటే అల్లేస్తారు. మెగాస్టార్ తో పూరి సినిమా అన్నది ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నారు. 150 కాకపోతే 160 అని..కచ్చితంగా అన్నయ్యతో సినిమా తీసి తీరుతానని అప్పట్లోనే సవాల్ విసిరారు. అందుకు సమయం ఇప్పుడు ఆసన్నమైంది. పూరి కంబ్యాక్ అన్నది 'ఆటో జానీ'తో గ్రాండ్ గా ఉంటుందని అతడి సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.