Begin typing your search above and press return to search.

ఆస్కార్ కి వెళ్లాలంటే అన్ని కోట్లు పెట్టాల్సిందేనా..?

ముందు ఆస్కార్ నామినేషన్స్ లో ఛాన్స్ దక్కించుకునేందుకే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ నామినేషన్స్ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది.

By:  Tupaki Desk   |   9 March 2025 8:30 AM IST
ఆస్కార్ కి వెళ్లాలంటే అన్ని కోట్లు పెట్టాల్సిందేనా..?
X

సినిమా తీసే ప్రతి ఒక్కరి కల ఎప్పటికైనా ఆస్కార్ అవార్డ్ అందుకోవాలనే ఉంటుంది. ప్రపంచం మొత్తం గుర్తించిన సినిమాలకు అకాడమీ అవార్డులు అందిస్తారు. జీవితంలో ఒక్క ఆస్కార్ అయినా సాధిస్తే చాలని కృషి చేసే సినిమా వాళ్ల గురించి తెలిసిందే. ఐతే ఆస్కార్ అనేది అంత ఈజీ విషయం కాదు. ముందు ఆస్కార్ నామినేషన్స్ లో ఛాన్స్ దక్కించుకునేందుకే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ నామినేషన్స్ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది.

ఆస్కార్ నామినేషన్స్ తర్వాత అవార్డ్ ప్రధానోత్సవం వరకు సినిమాను ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేయాలి. అకాడమీ అవార్డ్ కోసం సినిమా సెలెక్ట్ అయ్యేందుకు చాలా ప్రీమియర్స్ వేయించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోషన్స్, ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ ఇలా చాలా పెద్ద కహానీనే ఉంది. ఆస్కార్ కి నామినేట్ అవ్వడం వరకు ఓకే కానీ ఆ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

లేటెస్ట్ గా జరిగిన 97వ అకాడమీ అవార్డుల్లో ఆస్కార్ గెలుచుకున్న సినిమాలు సైతం కోట్లకు కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అనోరా సినిమా 149 కోట్లు, బ్రూటలిస్ట్ 83 కోట్లు ఖర్చు చేయగా కాంక్లేవ్ సినిమాకు ఏకంగా 166 కోట్ల దాకా జస్ట్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఖర్చు చేశారని తెలుస్తుంది. అంతెందుకు RRR సినిమాకు కూడా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్ల దాకా రాజమౌళి ఖర్చు చేశాడని తెలిసిందే.

ఇక నెక్స్ట్ ఆస్కార్ కి ఛాన్స్ ఉన్న సినిమాలు ఈ రేంజ్ ఇన్వెస్ట్ మెంట్ కు రెడీ అవ్వాలి. లాస్ట్ ఇయర్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ కాగా సినిమా నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేస్తే పుష్ప 2 కి 200 కోట్లు ఖర్చు చేసైనా ఆస్కార్ ప్రమోషన్స్ కు వెచ్చించే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు సినిమాకు 1800 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి అకాడమీ అవార్డుల్లో కూడా ఏదో ఒక అవార్డ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం పుష్ప 2 మేకర్స్ కూడా ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా సిద్ధం అనేలా ఉన్నారని తెలుస్తుంది.