Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌ : పుష్ప 2 మిడ్‌నైట్‌ షోలు రద్దు

పుష్ప 2 సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ ఎత్తున అంచనాలు పెరుగుతూనే వచ్చాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2024 12:30 PM GMT
బ్రేకింగ్‌ : పుష్ప 2 మిడ్‌నైట్‌ షోలు రద్దు
X

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్‌ సినీ ప్రేమికులు ఎక్కడ ఉన్నా పుష్ప 2 ను చూసేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప 2 సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ ఎత్తున అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 12000 స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

పుష్ప సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం తెలంగాణ, ఏపీలోనే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, నార్త్‌ రాష్ట్రాల్లోనూ సినిమా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను చాలా రాష్ట్రాల్లో బెనిఫిట్‌ షోలు, మిడ్‌ నైట్‌ షోలు వేయబోతున్నారు. కర్ణాటకలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని బయ్యర్‌ ప్లాన్‌ చేశారు. ముఖ్యంగా సినిమాకు బెనిఫిట్‌ షోలు, మిడ్‌ నైట్‌ షోలు ప్లాన్‌ చేయడం జరిగింది.

కన్నడ సినిమా నిర్మాతల ఫిర్యాదుతో పుష్ప 2 సినిమా యొక్క మిడ్‌ నైట్‌, బెనిఫిట్‌ షోలను రద్దు చూస్తూ అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు గగ్గోలు పెడుతున్నారు. అల్లు అర్జున్‌కి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటకలో భారీ ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. దాంతో బెనిఫిట్‌ షోలు మిడ్‌ నైట్‌ షోలు భారీ ఎత్తున స్పందన దక్కించుకుంటాయని అంతా భావించారు. కానీ అక్కడి ప్రభుత్వం ఆ ప్రత్యేక షోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ షాక్‌ అవుతున్నారు.

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌ కిస్సిక్ ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మొదటి రోజు వసూళ్లు రూ.300 కోట్లకు మించి ఉంటాయని అంతా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కర్ణాటకలో ప్రత్యేక షోలను రద్దు చేయడంతో ఫ్యాన్స్‌తో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో పుష్ప 2 సినిమా రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు సాధించాలంటే బెనిఫిట్‌ షోలు, మిడ్‌ నైట్‌ షోలు చాలా అవసరం. కానీ ఇప్పుడు ఆ షోలు రద్దు అయ్యాయి.