పుష్ప 3 స్కిప్ వెనక రీజన్ ఏంటి..?
పార్ట్ 3 కూడా ఉంది. అదేంటో తెలియదు కానీ పుష్ప 3 గురించి అటు డైరెక్టర్ సుకుమార్, ఇటు హీరో అల్లు అర్జున్ ఇద్దరు కూడా ప్రస్తావించలేదు.
By: Tupaki Desk | 8 Dec 2024 6:01 AM GMTఅల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు కూడా సినిమా ప్రేక్షకులను అలరించిన విధానం.. సినిమా రిలీజ్ నాడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు. ఐతే పుష్ప 2 కథ పూర్తి కాలేదు. పార్ట్ 3 కూడా ఉంది. అదేంటో తెలియదు కానీ పుష్ప 3 గురించి అటు డైరెక్టర్ సుకుమార్, ఇటు హీరో అల్లు అర్జున్ ఇద్దరు కూడా ప్రస్తావించలేదు.
పుష్ప సినిమా గురించి మాట్లాడిన సుకుమార్ ఇలా పాన్ ఇండియా సక్సెస్ వెనక రాజమౌళి ప్రోత్సాహం గురించి చెప్పారు. ఆయన చెప్పడం వల్లే ఈ సినిమా నేషనల్ వైడ్ రిలీజ్ చేశామని అన్నారు. ఇక ఈ సినిమాకు పనిచేసిన తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి చెప్పాడు సుకుమార్. ఒక్క సుకుమార్ కాదు ఇంతమంది సుకుమార్ లు కలిసి పనిచేశాడని అన్నారు.
ఐతే పుష్ప 3 గురించి మాత్రం సుకుమార్ ప్రస్తావించలేదు. మరోపక్క అల్లు అర్జున్ కూడా సినిమా విజయోత్సాహం ఇంకా ప్రీమియర్స్ నాడు జరిగిన ఇన్సిడెంట్, సినిమాకు సపోర్ట్ చేసిన వారి గురించి మాట్లాడాడు. ఐతే పుష్ప 3 గురించి మాట్లాడటం మర్చిపోయారు. కావాలని చేశారో లేదా అలా జరిగిందో కానీ పుష్ప 3 పై ఇప్పుడు పెద్ద డిస్కషన్ మొదలైంది. ఐతే ఇన్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం పుష్ప 3 ఉంటుంది కానీ ఇప్పుడప్పుడే కాదని అంటున్నారు.
పుష్ప 1, 2 సినిమాల కోసం సుకుమార్ కు ఐదేళ్లు డేట్స్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఐతే ఈ సినిమా తర్వాత త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా ఉంది. ఆ సినిమా కూడా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇదివరకు ఎవరు టచ్ చేయని ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా వస్తుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అదే పర్ఫెక్ట్ సినిమా అనుకుంటున్నారు. ఆ సినిమా తర్వాత పుష్ప 3 చేస్తాడని తెలుస్తుంది.
అంటే దాదాపు పుష్ప 3 కోసం ఎలా లేదన్నా మరో నాలుగైదేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సుకుమార్ కూడా ఈలోగా చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ కూడా లైన్ లో ఉన్నాడు. సో అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు వారి వారి సినిమాలు చేసి ఆ తర్వాత మళ్లీ కలిసి పుష్ప 3 చేస్తారు. కాకపోతే పుష్ప 3 తీసేందుకు చాలా టైం పడుతుందని తెలుస్తుంది.