ఇండియాలో నెంబర్ వన్ సింగర్ అతడే!
ఇంకా ఉచితంగా పాడే సింగర్ల కోసం ప్రయత్నించే ఉద్దుండులు మరికొంత మంది ఉన్నారని తెలిపారు.
By: Tupaki Desk | 12 Nov 2024 9:30 PM GMTఇండస్ట్రీలో ఫేమ్..ఫామ్ మాత్రమే డబ్బు తెచ్చి పెడుతుంది. అది లేకుండా? ఎంత ప్రయత్నించినా? ఆ ప్రయత్నం నిరాశనే మిగులుస్తుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సింగర్లు కొంత మంది గాయకులు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది? అన్నది రివీల్ చేసారు. పాట పాడటం కోసం సింగర్లతో బేరసారాలు ఎలా చేస్తారు? అన్నది పూస గుచ్చి మరీ చెప్పారు. ఐదు వేల నుంచి 1000 రూపాయలకు కూడా పాడే సింగర్లున్నారన్నారు.
ఇంకా ఉచితంగా పాడే సింగర్ల కోసం ప్రయత్నించే ఉద్దుండులు మరికొంత మంది ఉన్నారని తెలిపారు. ఇది నాణానికి ఒకవైపు అయితే మరోవైపు ఇలా ఉంటుంది. భారతీయ గాయకుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్ ఎవరు? అంటే మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ గా తేలింది. ఆయన ఒక పాట పాడితే మూడు కోట్లు ఛార్జ్ చేస్తారుట. ఆరకంగా నెంబర్ వన్ సింగర్ ఇండియాలో ఆయననేని తేలింది. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ గాయని శ్రేయ ఘోషాల్ ఉంది.
శ్రేయ ఒక్కో పాటకు 25 లక్షలు తీసుకుంటుందిట. శ్రేయ అన్ని భాషల్లోనూ పాటలు పాడుతుంది. భాషతో సంబంధం లేకుండా అద్భుతమైన గొంతుతోనే ఆమెకిది సాధ్యమైంది. ఆమె తర్వాత సునిధి చౌహాన్ ఉన్నారు. ఈవిడ ఒక్కో పాటకి 18 నుంచి 22 లక్షలు తీసుకుంటారుట. వీళ్లిద్దరి తర్వాత మరో హిందీ సింగర్ టాప్ లో ఉన్నాడు. అతడే అర్జిత్ సింగ్. ఈయన 20 లక్షల వరకు ఛార్జ్ చేస్తారుట. అర్జిత్ సింగ్ కి దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతడి పాటలకు చెవి కోసుకునే శ్రోతలెంతో మంది.
ఆ తర్వాత స్థానంలో సోనూ నిగమ్ ఉన్నారు. ఈయన 18లక్షల వరకూ తీసుకుంటాడుట. వీళ్లందరికీ ఇంత డిమాండ్ ఉండటానికి కారణం అన్ని భాషల్లోనూ పాటలు పాడటంతోనే ఇది సాధ్యమైందని సర్వేలు చెబుతున్నాయి. ఎంతో మంది ట్యాలెంటెడ్ గాయకులు ఉన్నా కొంత మంది మాతృభాషలకే పరిమితమవ్వడం..మరికొంత మందికి సరైన అవకాశాలు రాక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు.