చరణ్ తో ఆ హీరోయిన్ మరో మూవీ
తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత.
By: Tupaki Desk | 25 March 2025 7:34 PM ISTఏ మాయ చేసావె సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన సమంత మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సినిమా తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత.
అయితే టాలీవుడ్ లో అందరి సరసన వెంటనే ఛాన్స్ అందుకున్న సమంత, చరణ్ తో కలిసి నటించడానికి మాత్రం కాస్త టైమ్ పట్టింది. ఎట్టకేలకు రంగస్థలం సినిమాతో ఆ ఛాన్స్ ను కూడా అందుకుని ఆ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. రంగస్థలంలో సమంత, చరణ్ కెమిస్ట్రీ చూసి అందరూ ఫిదా అయిపోయారు.
రంగస్థలం సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేసింది లేదు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చరణ్ తో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నట్టు సమంత తెలిపింది. సిడ్నీలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న సమంతను రామ్ చరణ్ తో కలిసి మరో సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేయగా, దానికి సమంత నవ్వుతూ నేను కూడా చేయాలనే కోరుకుంటున్నా అని తెలిపింది.
ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ16 చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమా పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని సుకుమార్ అనుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్ తో నటిస్తున్న చరణ్, మరోసారి సమంత తో కలిసి నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఖుషి సినిమా తర్వాత సమంత ఇప్పటివరకు తెలుగులో మరో సినిమాను చేసింది లేదు. తన సొంత బ్యానర్ లోనే సమంత మా ఇంటి బంగారం సినిమాను చేయనున్నట్టు అనౌన్స్ చేసింది కానీ అనౌన్స్‌మెంట్ తర్వాత ఆ ప్రాజెక్టు కు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.