మెగాస్టార్ కోసం రాణీ ముఖర్జీ దిగుతుందా?
చిరంజీవి నుంచి ఇలాంటి సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ లు చాలా కాలమవుతుంది.
By: Tupaki Desk | 21 Feb 2025 12:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ లో రౌద్రాన్ని మరోసారి వెండి తెరపై ఆవిష్కరించబోతున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. 30 ఏళ్ల క్రితం నాటి మెగాస్టార్ ని మళ్లీ చూపించబోతున్నాడు. భారీ మాస్ చిత్రమని ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. చిరంజీవి నుంచి ఇలాంటి సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ లు చాలా కాలమవుతుంది.
దీంతో శ్రీకాంత్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తేలిపోయింది. 'దసరా'తో తానెంత మాస్ డైరెక్టర్ అన్నది ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో 158పై అంచనాలు ఇప్పటి నుంచి పీక్స్ కి చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమాకు ఎలాంటి నటీనటులని ఎంపిక చేయాలి? టెక్ని కల్ టీమ్ ఎలాంటిదై ఉండాలి? తన కాన్సెప్ట్ కి పాన్ ఇండియా అప్పిరియన్స్ రావాలంటే ఏం చేయాలి? అన్న దానిపై సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఓ మెగా లీక్ అందింది. ఇందులో హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేయాలి? అన్న అంశంపై మెగాస్టార్ తో చర్చకు రాగా... బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని సూచించారుట. రాణీ ముఖర్జీ అయితే చిరంజీవి ఎజ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. చిరంజీవి ఇప్పటికే 70 దగ్గర ఉన్న సంగతి తెలిసిందే. రాణీ ముఖర్జీ కి 46. ఈ జోడీ తెరపై బ్యూటీఫుల్ గా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాణీ పేరు సూచించగానే చిరంజీవి ఒకే చేసినట్లు లీకులందుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కి రాణీ ముఖర్జీ ఒకే చెప్పాలి. ఈ ప్రపోజల్ ఇంకా హైదరాబాద్ లోనే ఉంది. ఇంకా ముంబై చేరలేదు. చిరంజీవి లాంటి స్టార్ తో ఛాన్స్ అంటే రాణీ నో చెప్పే అవకాశం ఉండదు. అయితే ఆమె ఇంత వరకూ తెలుగులో సినిమాలు చేయలేదు. రెండేళ్ల గా ఆమె హిందీలోనూ కనిపించలేదు. ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమ ఆహ్వానాన్ని ఆమె స్వాగతిస్తుందా? లేదా? అన్నది చూడాలి.