కాప్ కింగ్ తో యాక్షన్ కింగ్ !
అయితే కొంత కాలంగా జాన్ అబ్రహం నటిస్తోన్న సినిమాలేవి ఆశించిన ఫలితాలు సాధించడం లేదు.
By: Tupaki Desk | 2 Feb 2025 1:30 PM GMTకాప్ కింగ్ తో యాక్షన్ కింగ్ జతకడుతున్నాడా? ఇద్దరు భారీ యాక్షన్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. బాలీవుడ్ లో కాప్ చిత్రాల కింగ్ గా రోహిత్ మారిన సగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో కాకీ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. అటు యాక్షన్ కింగ్ గా జాన్ అబ్రహం అలాంటి విజయాలే నమోదు చేసాడు. అయితే కొంత కాలంగా జాన్ అబ్రహం నటిస్తోన్న సినిమాలేవి ఆశించిన ఫలితాలు సాధించడం లేదు.
దీంతో స్టార్ హీరోల రేసులో బాగా వెనుకడ్డాడు. ఇతర స్టార్ల చిత్రాల్లో కీలక పాత్రలతోనూ మెప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జాన్ అబ్రహం కి బెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్ రోహిత్ శెట్టి ప్లాన్ చేస్తున్నాడుట. ఇద్దరు ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య స్టోరీ డిష్కషన్స్ ముగిసినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించి వేసవిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారుట.
అలాగే సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. ప్రస్తుతం జాన్ జాబితాలో 'ది డిప్లోమాట్, 'తెహ్రాన్', 'తరీఖ్' అనే చిత్రాలున్నాయి. ఈ సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మూడు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అవి షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయితే జాన్ ప్రీ అవుతాడు. అలాగే రోహిత్ శెట్టి గత ఏడాది ముగింపులో 'సింగం ఎగైన్' తో మరో హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత కొత్త సినిమా ప్రకటించలేదు. ప్రస్తుతం జాన్ సినిమా కోసమే రోహిత్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పట్టాలెక్కడానికి మరో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. 'సింబ' తర్వాత రోహిత్ కి కూడా సరైన సక్సెస్ పడలేదు. 'సూర్యవంశీ', 'సిర్కస్', 'స్కూల్ కాలేజ్ లైఫ్' చిత్రాలు చేసినా అవి ఆశించిన ఫలితాలు సాధించలేదు.