ఆర్సీ 17 లో సాయి పల్లవి లాక్!
మరి ఈ వేవ్ లో 17వ చిత్రం కోసం సుకుమార్ ఏ భామని లాంచ్ చేస్తాడు? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 25 Nov 2024 3:30 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ 17 లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో చరణ్ కి జోడీగా ఏ భామ నటిస్తుంది? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. సెట్స్ లో ఉన్న ఆర్సీ 16 కోసం జాన్వీ కపూర్ ని దించారు. ఆర్సీ 15 కోసం రెండవసారి కియారా అద్వాణి నే లాక్ చేసారు. మరి ఈ వేవ్ లో 17వ చిత్రం కోసం సుకుమార్ ఏ భామని లాంచ్ చేస్తాడు? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సుకుమార్ హీరోయిన్లు అంటే ఎక్కువగా ముంబై బాలీవుడ్ వాళ్లనే తీసుకుంటాడు. సౌత్ భామలకు సుకుమార్ ప్రాధాన్యత ఇవ్వాలంటే వారు బాగా ఫేమస్ అవ్వాలి. అలా ఈ మధ్య కాలంలో సుకుమార్ పరీక్షల్లో పాస్ అయింది రష్మిక మందన్న. అందుకే పుష్ప రెండవ భాగంలోనూ ఆమెను కొనసాగిస్తున్నారు. లేదంటే పుష్ప-2లో ఆమె స్థానంలో కొత్త భాను తీసుకునే అవకాశం ఉండేది. మరి చరణ్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడు? అంటే ఈసారి ఛాయిస్ సాయి పల్లవిని వరించినట్లు సమాచారం.
చరణ్ కి జోడీగా సాయిపల్లవిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారుట. ఈ విషయం ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. సినిమాలో హీరోయిన్ పాత్రకు అన్ని రకాలుగా సాయిపల్లవి ఫిట్ అవుతుందని ఆమెనే తీసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చేసారుట. సాయి పల్లవి అయితే సినిమాకి క్రేజ్ గా మారుతుంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్ లో రామాయణ్ లో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు `తండేల్` తో పాన్ ఇండియాలో పరిచయం అవుతుంది.
నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. చైతన్య కెరీర్ నే ఈ సినిమా మార్చేస్తుంది? అనే అంచనాలున్నాయి. సాయి పల్లవికి చైతన్య ఇస్తోన్న ప్రాధాన్యత చూస్తుంటే? ఆమె ఎంత ఎత్తుకు ఎదిగింది? అన్నది కూడా అద్దం పడుతుంది. ఓ నటికి అలాంటి నీరాజనం అంటే చిన్న విషయమా.