ప్రభాస్ ఫౌజీ.. ఫ్లాష్‌బ్యాక్‌లో టాలెంటెడ్ హీరోయిన్?
చిత్రంలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా అలాగే ఒక బ్రిటీస్ సైన్యంలో సోల్జర్ గా కనిపించనున్నాడని సమాచారం.
By: Tupaki Desk | 1 Feb 2025 8:45 AM GMTప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఫౌజీ అనే టైటిల్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్టుపై భారీ క్యూరియాసిటీ నెలకొంది. ఎందుకంటే 1940 వరల్డ్ వార్ నేపథ్యంలో ఒక ఎమోషనల్ లవ్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా అలాగే ఒక బ్రిటీస్ సైన్యంలో సోల్జర్ గా కనిపించనున్నాడని సమాచారం.
కథలో నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు కొంత కనెక్షన్ ఉందని వినిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాయికగా ఇమాన్వీ ఫిక్స్ అయినప్పటికీ, మరొక హీరోయిన్ కోసం చిత్రబృందం తగిన ఎంపిక కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో అత్యంత కీలకమైన అంశం ఫ్లాష్‌బ్యాక్ అని తెలుస్తోంది. కథకు అసలు బలమంతా అదేనని సమాచారం.
దర్శకుడు హను రాఘవపూడి తన మునుపటి సినిమాల్లానే ఇందులోనూ నెమ్మదిగా ఎమోషన్‌ను బలంగా మలచనున్నారని అంటున్నారు. ఈ ఫ్లాష్‌బ్యాక్ పార్ట్‌లో ప్రభాస్ పాత్రను మునుపెన్నడూ చూడని కొత్త యాంగిల్‌లో చూపించనున్నారు. ఇదే భాగంలో కనిపించబోయే మరో నాయిక పాత్ర కోసం చిత్రబృందం చాలా రోజులుగా అన్వేషిస్తోంది. ఈ పాత్రకు కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.
ఒకవేళ కథలో ఈ పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్ కోసం మాత్రమే ఉంటే, నటిగా బలమైన పర్సనాలిటీ కలిగినవాళ్లే ఆ పాత్రకు న్యాయం చేయగలరని భావిస్తున్నారు. పలు పేర్లు పరిశీలించగా, ఫైనల్‌గా ఆ రోల్ సాయి పల్లవికి వెళ్లే అవకాశాలున్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సాయి పల్లవి గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా చేసింది. దర్శకుడు గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ మరోసారి ఆమెను కలిసి కథ వినిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా హను రాఘవపూడి – సాయి పల్లవి భేటీ అయినట్టు సమాచారం. తండేల్ ప్రీరిలీజ్ కార్యక్రమాల నడుమ సాయి పల్లవి కథ విన్నట్టు టాక్. కథ వినిపించగానే ఆమె ఆసక్తిగా ఉండటమే కాకుండా, తన పాత్ర నచ్చిందని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ప్రమోషన్స్ పూర్తైన తరువాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. సాయి పల్లవి ఓకే అంటే, ఫౌజీ మరింతగా క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. గతంలో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల్లో చాలా డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మరి, ప్రభాస్ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక మరో నటి ఈ కీలక పాత్రను పోషిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.