Begin typing your search above and press return to search.

శ్రీసింహా.. సోలో హిట్ దక్కితేనే..

ఆ తర్వాత జక్కన్ననే తీసిన బ్లాక్ బస్టర్ హిట్ సునీల్ మర్యాద రామన్న సినిమాలో కనిపించారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 3:35 AM GMT
శ్రీసింహా.. సోలో హిట్ దక్కితేనే..
X

శ్రీసింహా కోడూరి.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా మత్తు వదలరా మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తన అంకుల్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ మూవీతో బాలనటుడిగా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు శ్రీసింహా. ఆ తర్వాత జక్కన్ననే తీసిన బ్లాక్ బస్టర్ హిట్ సునీల్ మర్యాద రామన్న సినిమాలో కనిపించారు. ఈగలో హీరోయిన్ సమంత కొలీగ్ గా నటించారు.

ఈగ మూవీ రిలీజ్ అయిన.. ఏడేళ్ల తర్వాత మత్తు వదలరా సినిమాతో హీరోగా ప్రేక్షకులను పలకరించారు. రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఆ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. డెబ్యూతో సక్సెస్ అందుకున్న హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఆ తర్వాత రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెల్లవారితే గురువారం సినిమా చేశారు. కానీ అనుకున్న స్థాయిలో సినీ ప్రియులను మెప్పించలేకపోయారు. అనంతరం టాలీవుడ్ బడా బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో వర్క్ చేశారు.

సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన దొంగలున్నారు జాగ్రత్తతో హిట్ కొడదామనుకున్నారు. కానీ డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత గత ఏడాది భాగ్ సాలే, ఉస్తాద్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉస్తాద్ తో మంచి ప్రశంసలు అందుకున్నా.. వసూళ్లు రాబట్టలేకపోయారు. ఇప్పుడు మత్త వదలరా-2తో భారీ హిట్ అందుకున్నారు. డెబ్యూ తర్వాత ఇన్నేళ్లకు తన ఖాతాలో రెండో హిట్ ను వేసుకున్నారు. వరల్డ్ వైడ్ గా మత్తు వదలరా సీక్వెల్ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

అయితే సినిమాలో కమెడియన్ సత్య కూడా లీడ్ రోల్ పోషించారన్న విషయం తెలిసిందే. నటించడమే కాదు.. సినిమాను దగ్గరుండి నడిపించారు. తన కామిక్ టైమింగ్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. సత్య కోసమే చూడాలన్న సినిమా విధంగా మెప్పించారు. తన టాలెంట్ తో శ్రీసింహాను మూవీలో డామినేట్ చేశారు. దీంతో సినిమా హిట్ అయ్యే విషయంలో సత్యదే మెయిన్ పాత్ర అని అంతా చెబుతున్నారు. కాబట్టి శ్రీసింహకు మంచి హిట్ వచ్చినా.. అది సోలో హిట్ కాదనే చెప్పాలి.

కానీ యాక్టింగ్ పరంగా మాత్రం శ్రీసింహాలో గ్రోత్ కనిపించింది. ఓ వైపు సినిమా హిట్ అయిందని ఆనందం ఉన్నా.. మరోవైపు ఎక్కువ క్రెడిట్ సత్యకు వెళ్లిందనే అయోమయం కూడా శ్రీసింహాకు ఉండి ఉంటుంది! కాబట్టి సోలోగా శ్రీసింహ మంచి హిట్ కొట్టాలి. అప్పుడే మార్కెట్ పెరుగుతుంది. స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సొంతంగా ఫ్యాన్ బేస్ వస్తుంది. మరి శ్రీసింహా.. ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చేస్తారో? సోలోగా సాలిడ్ హిట్ ఎప్పుడు అందుకుంటారో వేచి చూడాలి.