Begin typing your search above and press return to search.

టాలీవుడ్: సానుభూతి అస్త్రం పనిచేస్తోందా?

కంటెంట్ ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ఈ ప్రమోషన్ వర్క్ అవుట్ అయితే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వస్తాయి.

By:  Tupaki Desk   |   9 Nov 2024 4:58 AM GMT
టాలీవుడ్: సానుభూతి అస్త్రం పనిచేస్తోందా?
X

సినిమాల సక్సెస్ ని డిసైడ్ చేసేది అందులో ఉన్న కంటెంట్ అని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతారు. ఒక్కోసారి కంటెంట్ రొటీన్ గా ఉన్న ప్రెజెంటేషన్, ఎలివేషన్ ఆడియన్స్ కి నచ్చితే మూవీకి కనెక్ట్ అవుతారు. ఎక్కువగా కమర్షియల్ సినిమాలకి ఈ ఫార్ములా వర్క్ అవుట్ ఉంటుంది. అయితే చిన్న సినిమాకి ఆడియన్స్ ని రప్పించాలంటే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తోనే సాధ్యం అవుతుంది. కంటెంట్ ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ఈ ప్రమోషన్ వర్క్ అవుట్ అయితే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వస్తాయి.

స్టార్ హీరోల సినిమాలకి వారి ఇమేజ్ ప్లస్ అవుతుంది. అయితే స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాలు ఆడియన్స్ రప్పించాలంటే కంటెంట్ మీద ఫోకస్ చేయాల్సిందే అని సినీ విశ్లేషకులు అంటూ ఉంటారు. ఈ ఏడాది కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న సినిమాలకి సానుభూతి స్ట్రాటజీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో సెలబ్రెటీలు మాట్లాడే మాటలని ఆడియన్స్ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే కాంట్రవర్సీ లేదంటే సెంటిమెంట్ టాపిక్స్ ని పబ్లిక్ ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారు. మూవీ ఈవెంట్స్ లో ఆ సినిమాకి సంబందించిన నటీనటులు కావాలని సానుభూతి క్రియేట్ అయ్యే విధంగా మాట్లాడకపోయిన, వారు పేస్ చేసే స్ట్రగుల్స్ ని స్టేజ్ పై చెబుతున్నారు. అలాగే ఎదురయ్యే అవమానాలు గురించి పంచుకుంటున్నారు.

ఈ కామెంట్స్ పబ్లిక్ లో సదరు యాక్టర్స్ లేదా టెక్నీషియన్స్ పై సింపతీ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో పబ్లిక్ వారి సినిమాలు చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. సానుభూతి ఎమోషన్ తో సినిమా చూసినపుడు అందులో చిన్న చిన్న లోపాలు ఉన్న పెద్దగా పట్టించుకోరు. ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఒకటి, రెండు ఉన్న వాటికి బాగా కనెక్ట్ అయిపోతారు. పాజిటివ్ మౌత్ టాక్ ని జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్తారు.

ఈ ఏడాది రిలీజ్ అయ్యి హిట్ కేటగిరీలోకి వెళ్లిన సినిమాలకి ఈ సింపతీ స్ట్రాటజీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే సినిమా ఈవెంట్స్ లో మాట్లాడేటపుడు హార్ట్ నుంచి ఎమోషన్ వస్తే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ సింపతీ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవుతుంది కదా అని ప్లాన్ చేసి ఎమోషన్స్ చూపించే ప్రయత్నం చేస్తే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తోంది.