పార్ట్ -3లోనూ 50 ఏళ్ల బ్యూటీనే దించుతున్నారా?
ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడా? యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడా? అన్న అంశానికి ఇటీవలే తెరదించారు.
By: Tupaki Desk | 5 Feb 2025 6:57 AM GMTబాలీవుడ్ లో 'హేరాఫేరి' ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. అక్షయ్ కుమార్..సునీల్ శెట్టి..పరేష్ రావల్..సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాలు బాలీవుడ్ లోనే బ్రాండ్ గా మారాయి. అయితే ఇప్పుడీ ప్రాంచైజీ నుంచి 'హేరాఫేరి-3' కి కూడా రంగం సిద్దమవుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడా? యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడా? అన్న అంశానికి ఇటీవలే తెరదించారు.
ఈ ప్రచారాన్ని అక్షయ్ కుమార్ ఖండించి తన పాత్రలో యాధవిధిగా కొనసాగుతున్నట్లు వెల్లడించాడు. మూడవ భాగాన్ని డైరెక్ట్ చేసే బాధ్యతలు ప్రియదర్శన్ తీసుకున్నాడు. దర్శకుడి ఎంట్రీ విషయంలో కొంత స్థబ్తత కొనసాగింది. కానీ చివరిగా ఆ ఛాన్స్ ప్రియదర్శన్ కి వచ్చినట్లు కన్పమ్ అయింది. అయితే మూడవ భాగంలో హీరోయిన్ ఎవరు? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ ఛాన్స్ టబుకే ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని మేకర్స్ విశ్వసించి బరిలోకి దించుతున్నారు. 'హేరాఫేరీ' మొదటి భాగంలో టబునే నటించింది. కానీ రెండవ భాగంలో టబు నటించలేదు. దీంతో మూడవ భాగంలో తీసుకునే అవకాశం లేదని ..వయసు కూడా మీద పడటంతో? టబు నటించినా యూత్ కి కనెక్ట్ అవ్వడం కష్టమనే ప్రచారం జరిగింది. కానీ నటనలో టబుని మంచి నేటి తరం నటీమణులు ఎవరూ కనిపించకపోవడంతో? ఆ ఛాన్స్ మళ్లీ ఆమెకే వరించింది.
తన ఎంట్రీ విషయాన్ని టబు కూడా ధృవీకరించింది. దీంతో టబు పాత్ర మూడవ భాగంలో మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకా సినిమాలో చాలా కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు యువ భామలతో పాటు కొంత మంది సీనియర్ భామలకు కూడా సీన్ లోకి వస్తారని ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించనున్నారు. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.