షాకింగ్: ప్రియుడితో తమన్నా బ్రేకప్?
కానీ ఇంతలోనే ట్విస్టు. ఈ జంట విడిపోయారని మీడియాలో కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 4 March 2025 8:33 PM ISTస్టార్ హీరోయిన్ తమన్నా భాటియా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ డేటింగ్ గురించి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ జంట డేటింగ్ గురించి సోషల్ మీడియాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రేపో మాపో పెళ్లి చేసుకుంటారని కూడా అభిమానులు భావించారు. కానీ ఇంతలోనే ట్విస్టు. ఈ జంట విడిపోయారని మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఆ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుండి జంటగా ఉన్న ఫోటోలను తొలగించారు. దీనితో వారి సంబంధం అధికారికంగా ముగిసిందని అభిమానులు భావిస్తున్నారు. రెడ్డిట్ కథనం ప్రకారం... విజయ్ -తమన్నా కొన్ని వారాల క్రితం తమ రిలేషన్ షిప్‌ని ముగించారు.. కానీ స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం తమ కెరీర్‌లపై దృష్టి సారించారు. సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నారు. విడిపోయిన విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. కానీ సోషల్ మీడియాలు బ్రేకప్ ని ధృవీకరిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఈ జంట విడిపోయినా మంచి స్నేహితులుగా ఉన్నారని, వారి మధ్య ఎటువంటి ద్వేషం లేదని కూడా కథనాలొస్తున్నాయి. స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నారని, కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ చేస్తారని పింక్ విల్లా తన కథనంలో వెల్లడించింది. ఆ ఇద్దరూ ఎందుకు విడిపోవాలని అనుకున్నారు? అంటే... వారి బిజీ షెడ్యూల్ లు చిక్కులు తెచ్చి పెడుతున్నాయని, అంతకుమించి పెద్ద కారణం ఏదీ లేదని కూడా టాక్ వినిపిస్తోంది.
2023లో `లస్ట్ స్టోరీస్ 2` విడుదలైన తర్వాత విజయ్- తమన్నా ప్రేమకథ బహిరంగమైంది. ఈ ప్రాజెక్ట్ లో ఈ అందమైన జంట కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్యా రొమాన్స్ కుదిరింది. ఆ సమయంలో ఇద్దరి మధ్యా ప్రేమ మొదలైంది. రిలేషన్ షిప్ ని అనవసరమైన హంగామా లేకుండా సింపుల్ గా కొనసాగించారు. సంబంధాలు నిర్బంధంగా అనిపించకూడదని తాను నమ్ముతున్నానని జంటగా కలిసి సంతోషంగా ఉంటే దాచడానికి ఏమీ లేదని విజయ్ ఒకసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే తమన్నాను అతడు పెళ్లి చేసుకుంటాడని అంతా భావిస్తున్న సమయంలో ఇలా బ్రేకప్ అయింది.