Begin typing your search above and press return to search.

దేవరకి ఆ ఒక్కటే మైనస్

దేశ వ్యాప్తంగా దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

By:  Tupaki Desk   |   6 Sep 2024 4:03 AM GMT
దేవరకి ఆ ఒక్కటే మైనస్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లోనే దేవర బెస్ట్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సాంగ్స్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మూడు పాటలు కూడా దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. సెకండ్ సింగిల్ గా వచ్చిన రొమాంటిక్ మెలోడీ, మూడో సాంగ్ గా రిలీజ్ అయిన దావుదీ డ్యూయెట్ కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసినట్లు తెలుస్తోంది. విజువల్ గా చూడటానికి ఈ రెండు పాటలు బాగానే ఉన్నా కూడా హై స్టాండర్డ్స్ లో లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా బాహుబలి సిరీస్ లో సాంగ్స్ అన్ని కూడా విజువల్ గా హైస్టాండర్డ్స్ లో ఉంటాయి. ఆ పాటల కోసం రాజమౌళి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటని ఏకంగా ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. ఇలా పాటల విషయంలో కూడా పాన్ ఇండియా స్టాండర్డ్స్ ని రాజమౌళి మెయింటేన్ చేశారు. ఎక్కడా రాజీపడలేదు. రాజమౌళి అడిగినంత బడ్జెట్ నిర్మాతలు ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందని చెప్పాలి.

అయితే దేవర రెండు సాంగ్స్ కోసం వేసిన సెట్ వర్క్ హైస్టాండర్డ్స్ లో లేవనే మాట విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. విజువల్ బాగున్న కూడా ఆ సెట్ వర్క్స్ ఏవీ కూడా పాన్ ఇండియా బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసే స్థాయిలో లేవని అంటున్నారు. రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉన్నట్లు మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లు చెబుతున్న కూడా పాటల్లో ఆ రిచ్ నెస్ ఎక్కడా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

గతంలో ఎన్టీఆర్ జై లవకుశలో సాంగ్స్ కోసం వేసిన సెట్ వర్క్స్ కూడా అంత క్వాలిటీగా లేవని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్ లో అందరికి రీచ్ అవ్వాలంటే సాంగ్స్ విజువలైజేషన్ కి తగ్గట్లుగానే సెట్ వర్క్ కూడా హెవీ స్టాండర్డ్స్ లో ఉండాలనే మాట వినిపిస్తోంది. దేవర సినిమాకి ఇప్పటి వరకు అయితే ఈ ఒక్కటే మైనస్ గా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే కంటెంట్ లో బలమైన ఎమోషన్ ఉంటే ఆడియన్స్ కి మూవీ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఆ విషయంలో దేవర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.