Begin typing your search above and press return to search.

వెన్నెల కిషోర్ కి స్టేజ్ ఫియ‌ర్!

ఆఫ్ ది స్క్రీన్...ఆన్ ది స్క్రీన్ లో ఎంతో మందితో మాట్లాడుతుంటారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 11:30 PM GMT
వెన్నెల కిషోర్ కి స్టేజ్ ఫియ‌ర్!
X

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత చాలా మంది సెల‌బ్రిటీల‌కు స్టేజ్ ఫియ‌ర్ అన్న‌ది పోతుంది. ర‌క‌ర‌కాల మనుషుల‌తో ఇంట‌రాక్ష‌న్ ఉంటుంది. ఆఫ్ ది స్క్రీన్...ఆన్ ది స్క్రీన్ లో ఎంతో మందితో మాట్లాడుతుంటారు. వృత్తిగ‌త‌.. వ్య‌క్తిగ‌త విష‌యాలు చ‌ర్చించుకుంటారు. కెమెరా ముందు న‌టిస్తారు. ఆ స‌మ‌యంలో చుట్టూ వంద‌ల మంది ఉన్నా? సిగ్గు బిడియం అన్నింటిని వ‌దిలేసి న‌టించాల్సింది. ఇండ‌స్ట్రీలో అలాంటి వాళ్లు మాత్ర‌మే రాణించ‌గ‌ల‌రు.

క‌మెడియ‌న్ కం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కూడా అలా ఎన్నో సినిమాల్లో న‌టించిన త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కిం చుకున్నాడు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మొద‌లై క‌మెడియ‌న్ గా ఎంతో ఫేమ‌స్ అయ్యాడు. హాస్య ప్ర‌ధాన‌మైన సినిమాలు సోలోగా చేస్తున్నాడు. మ‌రి వెన్నెల కిషోర్ కి స్టేజ్ ఫియ‌ర్ ఉంది? అన్న‌ది ఎంత మంది తెలుసు. అవును ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేసాడు. వెన్నెల కిషోర్ కి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఒణికిపోతాడుట‌.

మైక్ చేతికి ఇస్తే కాళ్లు ఆడ‌వ‌ని అంటున్నాడు. అందుకే తాను ఫంక్ష‌న్ల‌కు..ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌కు పెద్ద‌గా రాన‌ని...బాగా ఇబ్బంది పెడితే త‌ప్ప‌క వ‌స్తాడు త‌ప్ప లేదంటే? ఎలా ఎస్కేప్ అవ్వాలా? అని ఆలోచిస్తాడుట‌. కేవ‌లం స్టేజ్ ఫియ‌ర్ తోనే ఇదంతా చేస్తాన‌న్నాడు. మైక్ ప‌ట్టుకుని మాట్లాడితే అంతా త‌న‌వైపే చూస్తార‌ని కాళ్లు ఎలా పెట్టాడు? చేతులు ఎలా ఆడిస్తున్నాడు? ముఖంలో హ‌వ‌భావాలు ఎలా ఉన్నాయి? ఇవ‌న్నీ ముందున్న ప్రేక్ష‌కులు గ‌మ‌నించ‌డంతో పాటు కెమెరాలు బంధించ‌డం త‌న‌కు చాలా ఇబ్బందిగా ఉంటుంద‌న్నాడు.

వెన్నెల కిషోర్ తెర మీద హీరో త‌ప్ప‌....తెర వెనుక కాద‌ని అర్ద‌మ‌వుతుంది. తెర మీద ఎలాంటి స‌న్నివేశాన్నైనా పండిచ‌గ‌ల‌డు. తెర వెనుక మైక్ ఇచ్చి మాట్లాడ‌మంటే? నీళ్లు న‌ములుతాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వెన్నెల కిషోర్ న‌టుడిగా పుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో వెన్నెల‌ స్నేహితుడు, క‌మెడియ‌న్ పాత్ర‌లు పోషిస్తున్నాడు.