వెంకటేష్ అప్పటి విక్టరీ రిపీట్..!
ఐతే ఈ సంక్రాంతికి వెంకటేష్ సినిమాతో పాటుగా రాం చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి.
By: Tupaki Desk | 16 Jan 2025 6:50 AM GMTవిక్టరీ వెంకటేష్ సినిమా వచ్చింది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆసక్తిగా ఉంటారు. అదే పండగకి సినిమా రిలీజ్ అంటే మరింత క్రేజ్ ఉంటుంది. ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్టరీ వెంకటేష్. పండగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఐతే ఈ సంక్రాంతికి వెంకటేష్ సినిమాతో పాటుగా రాం చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి.
ఈ సినిమాల్లో గేమ్ ఛేంజర్ కి మిశ్రమ స్పందన రాగా వసూళ్లు కూడా సోసోగానే ఉన్నాయి. ఇక పండగకు ఒకరోజు ముందు రిలీజైన బాలయ్య డాకు మహారాజ్ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగా ఎక్కేసింది. బాలకృష్ణలోని మాస్ యాంగిల్ ని బాబీ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడని అంటున్నారు. ఐతే ఈ రెండిటి కన్నా చివరగా రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.
వెంకటేష్ అనీల్ రావిపూడి ఈ కాంబో అంటేనే సూపర్ హిట్ అనేలా ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చూపించాయి. ఐతే మళ్లీ అదే కాంబో అదే రిజల్ట్ ఇంకా చెప్పాలంటే అంతకన్నా మంచి ఫలితాన్ని అందుకుందని చెప్పొచ్చు. ఐతే ఈ ఇయర్ సంక్రాంతి రిజల్ట్ చూస్తే ఆరేళ్ల క్రితం సంక్రాంతి ఫలితాన్నే రిపీట్ చేసినట్టు ఉంది. 2019 లో సంక్రాంతికి రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాతో వచ్చాడు. బాలయ్య ఎన్ టీ ఆర్ కథానాయకుడు తో వచ్చాడు. వెంకటేష్ ఎఫ్ 2 సినిమా రిలీజైంది. ఐతే ఈ 3 సినిమాల్లో వెంకటేష్ ఎఫ్2 నే సూపర్ హిట్ గా నిలిచింది.
అప్పుడు చరణ్ వినయ విధేయ రామ ఫ్లాప్ అవ్వగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ పర్వాలేదు అనిపించుకుంది. ఐతే అప్పుడు ఎన్ టీ ఆర్ బయోపిక్ తో వచ్చిన బాలయ్య ఫలితం నిరాశపరచగా ఈసారి డాకు మహారాజ్ గా బాలయ్య ఇంప్రెస్ చేశాడు. ఐతే వెంకటేష్ మాత్రం అప్పుడు ఎఫ్2 తో హిట్ కొట్టాడు అదే విక్టరీని సంక్రాంతికి వస్తున్నాం తో కూడా రిపీట్ చేశాడు. సో మొత్తానికి వెంకటేష్ విక్టరీ మాత్రం రిపీట్ అయ్యిందని చెప్పొచ్చు.