ఓటీటీలో వచ్చేసిన హిట్ మూవీ సీక్వెల్
భారీ అంచనాల నడుమ రూపొందిన విడుదలై పార్ట్ 2 సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 19 Jan 2025 7:37 AM GMTతమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొంది 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విడుదలై పార్ట్ 1' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సూరి ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్‌లో ఆ సినిమాలో నటించారు. విడుదలై సినిమాకు సీక్వెల్‌గా విడుదలై పార్ట్ 2 రూపొందింది. పార్ట్‌లో విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటించగా, సూరి చిన్న పాత్రలో కనిపించాడు. మంజు వారియర్ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా నటించింది. భారీ అంచనాల నడుమ రూపొందిన విడుదలై పార్ట్ 2 సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.
విడుదలై పార్ట్ 1 సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ అంచనాలకు తగ్గట్లుగా సినిమాను వెట్రిమారన్ రూపొందించలేక పోయాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా మినిమం వసూళ్లు సాధిస్తుంది. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ్‌తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల అయ్యింది. కానీ అన్ని చోట్ల తీవ్రంగా నిరాశ పరిచింది. కమర్షియల్‌గా నిరాశ పరచిన విడుదలై పార్ట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను నేడు అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. పలు సినిమాలు థియేట్రికల్ రిలీజ్‌లో ఆకట్టుకోలేక పోయినా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే విడుదలై పార్ట్ 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి గత ఏడాది మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడు ఎక్కువ సక్సెస్‌ని దక్కించుకున్న విషయం తెల్సిందే.
విడుదలై పార్ట్ 2లో విజయ్ సేతుపతికి జోడీగా మంజు వారియర్ నటించింది. ఇద్దరి కాంబో సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సినిమా కథ విషయంలో దర్శకుడు వెట్రిమారన్ నిరాశ పరిచారు. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా రెండో పార్ట్‌ని భారీగా తీయాలని గాడి తప్పినట్లుగా అనిపించింది. అందుకే సినిమా థియేట్రికల్ రిలీజ్‌లో నిరాశ పరచింది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన దక్కుతుంది అనేది చూడాలి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూస్తున్నారు. మరి మీరు ఈ సినిమాను చూశారా...!