Begin typing your search above and press return to search.

బాలయ్య అంత పని చేస్తాడా..!

దసరా బరి నుంచి తప్పుకున్న NBK109 సినిమాను ఇదే ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేయాలని భావించారు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 11:30 PM GMT
బాలయ్య అంత పని చేస్తాడా..!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న NBK109 చిత్రం ను దసరా కానుకగా విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు. కానీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఇవ్వాల్సిన విధంగా డేట్లు ఇవ్వలేక పోయాడు. అందుకే షూటింగ్‌ కు చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే NBK109 సినిమా విడుదల ఆలస్యం అయ్యేలా ఉందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు సినిమా టైటిల్‌ ను కూడా ఖరారు చేయలేదు కానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

దసరా బరి నుంచి తప్పుకున్న NBK109 సినిమాను ఇదే ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేయాలని భావించారు. కానీ అదే నెలలో పుష్ప 2 తో పాటు మరికొన్ని సినిమాలు ఉండటంతో పాటు, అప్పటి వరకు విడుదలకు రెడీ అవుతుందా అనే అనుమానం ఉందట. అందుకే జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ మరియు బాలయ్య కూడా భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో NBK109 సినిమా రూపొందుతోంది. అదే బ్యానర్ లో రూపొందుతున్న రవితేజ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది.

2025 సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను విడుదల చేయబోతున్నారు. అంతే కాకుండా వెంకటేష్ హీరోగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక నాగార్జున కొత్త సినిమాను సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి స్పష్టత లేదు. నాగ్‌ సినిమా విషయంలో మరింత స్పష్టత రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. రవితేజ సినిమా ను సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే సితార వారు ప్రకటించారు.

పెద్ద హీరోల క్రేజీ సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. దాంతో ఆ సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని భావించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ బాలయ్య అండ్‌ టీమ్‌ మాత్రం సంక్రాంతికే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. బాలయ్య కు సంక్రాంతి సెంటిమెంట్‌ కలిసి వస్తుందని, తప్పకుండా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా హిట్‌ అవ్వాలంటే సంక్రాంతికే రావాలి అంటూ ఫ్యాన్స్‌ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి అంటే పెద్ద సీజన్‌.. కనుక ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కంటెంట్‌ బాగుంటే కచ్చితంగా హిట్ కొట్టి మంచి వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.