Begin typing your search above and press return to search.

దేవర - పుష్ప 2: అక్కడ బెస్ట్ డీల్స్!

దీనిని దృష్టిలో ఉంచుకొని యూనివర్సల్ గా అందరికి చేరువ అయ్యే మాస్ కథలకి స్టార్స్ పెద్దపీట వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2024 4:19 AM GMT
దేవర - పుష్ప 2: అక్కడ బెస్ట్ డీల్స్!
X

టాలీవుడ్ లో స్టార్ హీరోల నుంచి మేగ్జిమమ్ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. అందరూ యూనివర్సల్ కథల పైనే ఫోకస్ చేశారు. వీటి ద్వారా తమ మార్కెట్ ని మరింత విస్తృతం చేసుకుంటున్నారు. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా ఆదరణ లభిస్తుంది. దాంతో మార్కెట్ కూడా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని యూనివర్సల్ గా అందరికి చేరువ అయ్యే మాస్ కథలకి స్టార్స్ పెద్దపీట వేస్తున్నారు.

ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసిన మన హీరోలు ఇప్పుడు మొత్తం సీరియస్ కథలనే ట్రై చేస్తున్నారు. మన స్టార్ హీరోలకి కర్ణాటకలో మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగా అక్కడి డిస్టిబ్యూటర్స్ తెలుగు సినిమాల కర్ణాటక రైట్స్ ని సాలిడ్ ధరకి కోనేసేవారు. ఇప్పుడు అన్ని భాషలకి సంబందించిన రైట్స్ కావడం ఇంకా ఎక్కువ ధరకి కర్ణాటక రైట్స్ అమ్ముడవుతున్నాయి.

నెక్స్ట్ టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల నుంచి రాబోయే పాన్ ఇండియా సినిమాల కర్ణాటక రైట్స్ చూసుకుంటే టాప్ లో పుష్ప ది రూల్ మూవీ ఉంది. ఈ సినిమా అన్ని భాషలకి సంబందించిన కర్ణాటక రైట్స్ 32 కోట్లకి అమ్ముడయ్యాయి. ఐకాన్ స్టార్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ డీల్. కర్ణాటకలో ఆంధ్రా సరిహద్దులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. అక్కడ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తారు.

అలాగే తమిళనాడు బోర్డర్ లో తమిళ్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. బెంగుళూరు, హిందీ జనాలు కూడా విపరీతంగా ఉంటారు. మిగిలిన స్టేట్ మొత్తం కన్నడ, కేరళ బోర్డర్ లో మలయాళీ వెర్షన్స్ రిలీజ్ అవుతాయంట.నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలకి కర్ణాటకలో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే దేవర పార్ట్ 1, దేవర స్ట్రోమ్ సినిమాలకి సంబందించిన రైట్స్ డీల్ 25 కోట్లకి సెట్ అయ్యిందంట. మొదటి నుంచి దేవరకు అక్కడ మంచి డిమాండ్ ఉంది.

కన్నడ ఆడియెన్స్ అక్కడ ఎన్టీఆర్ ను లోకల్ హీరోగానే ప్రేమిస్తారు. అందుకే దేవర హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఇక దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ఇక పుష్ప ది రూల్ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. పుష్ప మూవీ కన్నడనాట మంచి సక్సెస్ అందుకుంది. ఈ కారణంగానే భారీ ధరకి పుష్ప ది రూల్ రైట్స్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.