Begin typing your search above and press return to search.

హ.. హ.. హాసిని రీ ఎంట్రీ ఎప్పుడు..?

తన క్యూట్ యాక్టింగ్ తో ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే జెనిలియా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   6 Jun 2024 8:09 AM GMT
హ.. హ.. హాసిని రీ ఎంట్రీ ఎప్పుడు..?
X

బొమ్మరిల్లు హ..హ.. హాసిని గుర్తుంది కదా.. ఇప్పటి యువతకు ఆమె తెలియకపోవచ్చు కానీ పదిహేనేళ్ల క్రితం యూత్ గా ఉన్న ఆడియన్స్ కు మాత్రం ఆమె బాగా తెలుసు. హాసిని పాత్రతో అదరగొట్టిన బాలీవుడ్ భామ జెనిలియా ఓ పక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో జెనిలియాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అవ్వకపోయినా జెనిలియా ఉంది అంటే చాలు సంథింగ్ స్పెషల్ అనిపించేది. తన క్యూట్ యాక్టింగ్ తో ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే జెనిలియా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది.

బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్లాడిన జెనిలియా సినిమాలకు కూడా దూరమైంది. ఐతే చాలా గ్యాప్ తర్వాత జెనిలియా తన భర్తతో కలిసి వేద్ అనే సినిమా చేసింది. జెనిలియా సిల్వర్ స్క్రీన్ మీద కనబడితే చూడాలని కోరుకునే ఫ్యాన్స్ అందరికీ ఆ సినిమా మంచి కిక్ ఇచ్చింది. 2012 లో చివరగా నా ఇష్టం సినిమాలో నటించిన జెనిలియా ఆ తర్వాత మళ్లీ ఇటువైపు తిరిగి చూడలేదు.

ఆమధ్య గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి చేస్తున్న సినిమాలో జెనిలియా నటిస్తుందని హడావిడి చేశారు. ఆ సినిమా ఏమైందో కూడా తెలియదు. జెనిలియా రీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాల స్టామినా చూపిస్తున్న సందర్భంగా అవకాశం వస్తే తెలుగులో నటించడానికి తాను రెడీ అంటుంది జెనిలియా. కానీ ఆమెకు తగిన పాత్రలు రావట్లేదని తెలుస్తుంది.

తెలుగులో తను చేసిన సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులను తన ఫ్యాన్స్ గా చేసుకున్న జెనిలియా రీ ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ట్రై చేస్తుందని తెలుస్తుంది. మరి జెనిలియా మళ్లీ తెలుగులో నటిస్తే హీరోయిన్ గా కొనసాగుతుందా లేదా సపోర్టింగ్ రోల్స్ తో అడ్జెస్ట్ అవుతుందా అన్నది చూడాలి. ఒకప్పటి హీరోయిన్స్ అంతా కూడా రీ ఎంట్రీ ఇస్తూ సర్ ప్రైజ్ చేస్తుండగా జెనిలియా కూడా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ని అలరించాలని కోరుతున్నారు.